నర్సంపేట (వరంగల్): గోదావరి జలాలతో సాగునీరందించి రాష్ట్రాన్ని సస్యశ్యావులం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలతో అడ్డుపడినా.. పూర్తిచేసి తీరుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట వుండలంలోని వూదన్నపేట చెరువు కట్టపై ఏర్పాటు చేసిన 45 అడుగుల మిషన్ కాకతీయు పైలాన్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు.
సభలో మాట్లాడుతూ... నర్సంపేట ప్రాంతంలోని పాకాల, మాదన్నపేట, రంగాయి చెరువులకు దేవాదుల నీటిని తరలించి రెండో పంటకు సాగు నీరందించేందుకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నా.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ విషయమై సోనియాను కలసి మాట్లాడలేదని విమర్శించారు. మనుగడ కాపాడుకునేందుకే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ అడ్డుపడినా కాళేశ్వరం ఆగదు: హరీష్‌రావు
Published Fri, May 13 2016 9:58 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement