Supreme Court rejects plea seeking halt for Vande Bharat Express at Kerala's Tirur - Sakshi
Sakshi News home page

వందేభారత్‌ స్టాప్‌ కోసం సుప్రీంలో పిటిషన్‌.. సీరియస్‌ అయిన చీఫ్‌ జస్టిస్‌

Published Tue, Jul 18 2023 9:28 AM | Last Updated on Tue, Jul 18 2023 10:01 AM

CJI Angry With Kerala Vande Bharat Stop Request Petition - Sakshi

ఢిల్లీ: భారత సెమీ హైస్పీడ్‌ రైలు వందేభారత్‌ గురించి దేశంలో ఎక్కువ చర్చ నడుస్తోంది. ఒకదాని తర్వాత మరో సర్వీస్‌ పట్టాలెక్కుతుండడంతో.. ఇతర రైళ్లపైనా  ఈ ప్రభావం పడుతోంది. అయితే.. తాజాగా సుప్రీం కోర్టులో వందేభారత్‌ గురించి ఓ పిటిషన్‌ దాఖలు అయ్యింది. 

వందేభారత్‌ రైలును తమ ఊరి స్టేషన్‌లో ఆగేలా రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేయాలంటూ కేరళకు చెందిన ఓ యువ లాయర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో పిటిషనర్‌ పీటీ షీజీష్‌ను సుప్రీం కోర్టు మందలించగా.. కనీసం ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించేలా ఆదేశాలివ్వాలని కోరగా.. సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ మండిపడింది. 

ఇది అసాధారణమైన విజ్ఞప్తి.. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని పోస్టాఫీసుగా భావించొద్దంటూ ధర్మాసనం మండిపడింది. వందేభారత్‌ రైలు ఎక్కడ ఆగాలో నిర్ణయించాలని మమ్మల్ని కోరుతున్నావ్‌?.. తర్వాత ఢిల్లీ-ముంబై రాజధానిని ఆపాలని అడుగుతావా?.. ఇది విధానాలకు సంబంధించిన విషయం కాబట్టి అధికారులకు దగ్గరకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే పిటిషనర్‌కు బెంచ్‌ సూచించింది. 

ఇక పరిశీలనకు పంపాలన్న అభ్యర్థనకు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన సీజేఐ.. ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.

వందేభారత్‌ రైలు.. తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్‌ మధ్య నడుస్తోంది. అత్యధిక జన సాంద్రత.. పైగా ప్రయాణికుల రద్దీతో ఉండే మలప్పురం స్టేషన్‌కు మాత్రం వందేభారత్‌ స్టాప్‌ కేటాయించలేదు. బదులుగా.. తిరూర్‌ రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌కు స్టాప్‌ను కేటాయించించింది రైల్వేశాఖ. అయితే.. ఆ తర్వాత ఆ ప్రతిపాదనను విస్మరించిందని.. చుట్టుపక్కల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంట్నునారంటూ పిటిషనర్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బదులుగా 60 కిలోమీటర్ల దూరంలోని పలక్కాడ్‌ షోర్నూర్‌కు స్టాప్‌ మంజూరు చేశారని కోర్టు దృష్‌టికి తీసుకెళ్లాడు పిటిషనర్‌. అయితే.. 

వందే భారత్ రైలు వంటి హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వ్యక్తిగత లేదంటే స్వార్థ ప్రయోజనాల ఆధారంగా డిమాండ్‌పై స్టాప్‌లు కేటాయించబడవు. ప్రజల డిమాండ్ మేరకు స్టాప్‌లు ఏర్పాటు చేస్తే, ఎక్స్‌ప్రెస్ రైలు అనే పదం తప్పుగా మారుతుంది అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతకు ముందు పిటిషనర్‌ కేరళ హైకోర్టులోనూ ఓ పిటిషన్‌ వేయగా.. అది రైల్వే పరిధిలోకి వస్తుందంటూ ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement