పీవోకేలో చైనా తన కార్యకలాపాలను ఆపాలని భారత్ మరోసారి చైనాకు స్పష్టం చేసింది.
పీవోకే లో కార్యకలాపాలను ఆపండి
Published Fri, May 20 2016 6:15 PM | Last Updated on Wed, Apr 3 2019 8:54 PM
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో చైనా తన కార్యకలాపాలను ఆపాలని భారత్ మరోసారి చైనాకు స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీవోకేలో చైనా కార్యకలాపాలను భారత్ అంగీకరించదని స్సష్టం చేశారు. పీవోకే భారత్ లో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. షియా తెగ అధికంగా ఉన్న ప్రాంతంమైన గిల్గిత్, బల్టిస్థాన్ ప్రాంతంలో చైనా అనేక కార్యాక్రమాలను చేపపట్టేందుకు చైనా పెట్టుబడులు కుమ్మరిస్తోందని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement