గుంటూరు : గుంటూరు జిల్లాలో పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు గ్రామంలో ఆరు బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో బాల్య వివాహాలు జరుపుతున్నట్టు గురువారం పోలీసులకు సమాచారం రావడంతో వివాహా మండపాలకు చేరుకొని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా శిశు సంక్షేమం కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. కాగా, కుటుంబసభ్యులు అధికారుల నుంచి నకిలీ దృవ పత్రాలతో రేషన్ కార్డులను మధ్యవర్తుల ద్వారా సంపాదించారు. వాటిని అడ్డుగా పెట్టుకొని ఈ వివాహాలకు పాల్పడుతున్నారు. కాగా, పోలీసులు తమ విచారణలో బాలికలకు వయస్సు సుమారు 12 నుంచి 13 ఏళ్లుగా గుర్తించారు.
(పెదకూరపాడు)
బాల్యవివాహాలను అడ్డుకున్న పోలీసులు
Published Thu, Apr 2 2015 2:47 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement