
తిరువనంతపురం: భయభ్రాంతులకు గురి చేసినా, ఎంపీ పదవి నుంచి తొలగించినా వయనాడ్ లోక్‌సభ స్థానం ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా తననెవరూ అడ్డుకోలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తేలి్చచెప్పారు. అనర్హత వేటు తర్వాత తొలిసారిగా కేరళలోని వయనాడ్ జిల్లాలో ఆయన మంగళవారం పర్యటించారు. కల్పెట్టాలో ‘సత్యమేవ జయతే’ పేరిట రోడ్డు షో నిర్వహించారు. తనను జైలులో పెట్టినప్పటికీ వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటానన్నారు.
'నాపైకి పోలీసులను పంపిస్తే, నా ఇంటిని లాక్కుంటే భయపడే ప్రసక్తే లేదు. అదానీ గురించి, ఆయనతో ప్రధాని మోదీకి సంబంధాల గురించి నా ప్రశ్నలను తట్టుకోలేకే లోక్‌సభ నుంచి పంపించారు' అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు రాహుల్‌పై బీజేపీ ప్రభుత్వం క్రూరంగా మాటల దాడికి పాల్పడిందని ఆయన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా ఆరోపించారు. అబద్ధాలు చెప్పేవారికి, దు్రష్పచారం చేసేవారికి నిజాలు చేదుగానే ఉంటాయని ఎద్దేవా చేశారు.
చదవండి: 300 పైగా సీట్లతో బీజేపీ గెలుపు.. మోదీనే మూడోసారి ప్రధాని: అమిత్ షా
Comments
Please login to add a commentAdd a comment