ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ముడిపడిన విస్తృత నష్టాలను అంచనా వేయడానికి, తగ్గించడానికి ఓపెన్ ఏఐ బృందం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ బెదిరింపులు, వ్యక్తిగత ఒప్పందాలు, సైబర్ సెక్యూరిటీ, అటానమస్ రెప్లికేషన్‌తో సహా సంభావ్య ఏఐ బెదిరింపులపై ఈ బృందం దృష్టి సారించనుంది.
అలెగ్జాండర్ మాడ్రీ నేతృత్వంలోని ఈ బృందం.. ఏఐని ఉపయోగించుకుని ఎవరైనా చేసే కుట్రపూరిత చర్యలకు అడ్డుకట్ట వేసే పనిని ప్రారంభించింది. అలాగే ఏఐ వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్ల కలిగే నష్టాలను పరిశోధిస్తుంది. ఇటువంటి దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఓపెన్ ఏఐ ఒక ఛాలెంజ్ కూడా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో ఉత్తమంగా నిలిచిన వాటికి ఏపీఐ క్రెడిట్‌తో పాటు 25 వేల డాలర్లు(ఒక డాలర్ రూ.83.15) అందించనున్నట్లు ప్రకటించింది.
చాట్ జీపీటీ తరహా సాంకేతికతను అభివృద్ధి చేసే ఓపెన్ ఏఐ ఇప్పుడు ఏఐతో ఏర్పడే ముప్పును అంచనా వేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోంది. ఇటీవలే దీని గురించి వెల్లడించింది. దీని ప్రధాన లక్ష్యం ఏఐ సాంకేతికత వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే భారీ ముప్పులపై అధ్యయనం చేయడం, అంచనా వేయడం, తగ్గించడం. గత జూలైలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తలెత్తే ముప్పును అరికట్టేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఓపెన్ ఏఐ సూచించింది.
కృత్రిమ మేధస్సుతో ముడిపడిన ఏఐ వ్యవస్థలు ఏదో ఒక రోజు మానవ మేధస్సును అధిగమించవచ్చనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అయితే ఓపెన్ ఏఐ.. కృత్రిమ మేథలో తలెత్తే ముప్పును నివారించే దిశగా ముందడుగు వేస్తోంది. ఈ నేపధ్యంలో 2023 మే నెలలో ఈ సంస్థ.. ఏఐతో కలిగే ముప్పును ప్రస్తావిస్తూ, ఒక బహిరంగ లేఖను ప్రచురించింది. కృత్రిమ మేథస్సుతో కలిగే నష్టాలను ప్రపంచ స్థాయిలో తీవ్రంగా పరిగణించాలని ఆ లేఖలో ఓపెన్ ఏఐ కోరింది.
ఇది కూడా చదవండి: ఖతార్‌లో అత్యాచారానికి ఏ శిక్ష విధిస్తారు?
Comments
Please login to add a commentAdd a comment