భారీ కేసులలో దొంగలు చిక్కడం లేదు. బంగారం రికవరీ లేదు. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణంలో భారీ దొంగతనాలు జరిగి ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఒక్క కేసూ పరిష్కారం కాలేదు.
కామారెడ్డి, న్యూస్‌లైన్: భారీ కేసులలో దొంగలు చిక్కడం లేదు. బంగారం రికవరీ లేదు. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణంలో భారీ దొంగతనాలు జరిగి ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఒక్క కేసూ పరిష్కారం కాలేదు. చోరీలు జరిగినపుడు పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం, కొంత కాలం ఆ బృందాలు విచారణ నిర్వహించి తరువాత మరిచిపోవడం జరుగుతోంది. కామారెడ్డిలో గడచిన మూడేళ్ల కాలంలో రూ. కోటిన్నరకు పైగా విలువైన బంగారం, నగ దు చోరీ జరిగింది. భారీ దొంగతనాలతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
ఇదే సమయంలో పట్టణంలోని పలు కాలనీలలో దొంగతనాలు పెరిగాయి. ఇళ్లకు తాళం వేసి ఉంటే చాలు దొంగలుపగులగొట్టి ఇళ్లల్లో నుం చి బంగారం, నగదు, ఇతర వస్తువులను దోచుకెళ్లడం పరిపాటిగా మారింది. పట్టణ పోలీసులు పెట్రోలింగు పేరుతో హడావుడి చేయడమే తప్ప దొంగతనాలను నిరోధించలేకపోయారన్న అపవాదు మిగిలింది. ఇదే సమయంలో పగ టిపూట మహిళల మెడల్లోంచి బంగారు ఆభరణాల దొంగతనాలు కూడా ఎక్కువగానే జరిగాయి. తాళాలేసిన ఇళ్లల్లో దొంగతనాలు, మహిళల మెడల్లోంచి బంగారు ఆభరణాలు దోచుకెళ్లడం పరిపాటిగా మారి న పరిస్థితుల్లో వాటిని ఛేదించేందుకు అపసోపాలు పడుతు న్న పట్టణ పోలీసులు భారీ దొంగతనాల విషయాన్ని పట్టిం చుకునే పరిస్థితులలో లేరనే చెప్పాలి. దీంతో పట్టణంలో జరిగిన భారీ బంగారం చోరీ కేసులు పరిష్కారానికి నోచు కోవడం లేదు. పట్టణంలో పోలీసులు ప్రధానంగా తమకు సంబంధంలేని వ్యవహారాల్లో తలదూర్చడమే తప్ప ఇలాం టి కేసుల విషయంలో ఆసక్తి చూపడం లేదన్న అపవాదులు మూటగట్టుకున్నారు.
మరుగున పడిన బంగారం చోరీ కేసులు..
2010లో గుంటూరుకు చెందిన బంగారం వ్యాపారి కామారెడ్డిలోని బంగారు వ్యాపారులను కలిసి తిరుగు ప్రయాణంలో బస్టాండ్‌కు వెళ్లారు. బస్సు ఎక్కుతున్నపుడు తన వద్ద ఉన్న ఐదు కిలోల బంగారం బ్యాగును దొంగలు తస్కరించారు. ఆ కేసు ఇప్పటి వరకు కొలిక్కిరాలేదు.
2011లో పట్టణంలోని స్టేషన్‌రోడ్డులో కైలాస్ శేఖర్ తన ఎలక్ట్రానిక్స్ షాపును మూసి వేసి ద్విచక్ర వాహనంపై జయప్రకాశ్‌నారాయణ విగ్రహం సమీపంలోని ఇంటికి చేరారు. వాహనం దిగేలోపే ఆయన బ్యాగును దొంగలు అపహరించుకు వెళ్లారు. బ్యాగులోని రూ. లక్ష నగదుతో పాటు రూ.లక్ష విలువైన బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌కార్డులు దొంగల పరమయ్యాయి.
2012 సెప్టెంబర్‌లో పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద జిరాక్స్ సెంటర్ యజమానికి లక్ష్మన్ దుకాణాన్ని మూసివేసి విద్యానగర్‌లోని తన ఇంటికి వెళ్లారు. ఆయనను వెంబడించిన దొంగలు అతని వద్ద ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. బ్యాగులో రూ. 30 వేల నగదు ఉన్నట్టు అప్పుడు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2012 అక్టోబర్ ఐదున పట్టణంలోని శివం జువెల్లర్స్ యజమాని పాత శ్రీనివాస్ రోజులాగే రాత్రి తన దుకాణాన్ని మూసి వేసి కిలోన్నర బంగారం, ఆభరణాలతో పాటు రూ. 10 లక్షల నగదును బ్యాగులో తీసుకుని వీక్లీమార్కెట్‌లోని తన ఇంటికి వెళ్లారు. ఇంటిదగ్గర ద్విచక్ర వాహనాన్ని ఆపి ఇంట్లోకి వెళ్లే సమయంలో గుర్తుతెలి యని దుండగులు బ్యాగును లాక్కుని పారిపోయారు. అప్పుడు బంగారం, నగదు కలిపి రూ. 58 లక్షల విలువ కట్టారు.
2012లో పట్టణంలోని పలు బంగారం దుకాణాల్లో పట్టపగలే మహిళలు వెండి ఆభరణాలు దొంగిలించారు. దొంగతనం విషయం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా పోలీసులు విచారణజరిపినా దొంగలు చిక్కలేదు.