సర్వేను అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు
కాసిపేట : మండలంలోని దుబ్బగూడెంలో ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా రెవెన్యూ అధికారులు బుధవారం ప్రారంభించిన సామాజిక ఆర్థిక స్థితిగతుల సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు.
-
స్థలం ఎక్కడ కేటాయిస్తారో చెప్పాలని డిమాండ్
కాసిపేట : మండలంలోని దుబ్బగూడెంలో ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా రెవెన్యూ అధికారులు బుధవారం ప్రారంభించిన సామాజిక ఆర్థిక స్థితిగతుల సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు.
తమకు భూమి ఎక్కడ కేటాయిస్తారు..పరిహారం ఏ విధంగా చెల్లిస్తారో చెప్పకుండా సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించారు. మొదట ఇళ్ల సర్వే పూర్తిచేసి వివరాలన్ని చెబుతామని..గ్రామస్తుల ఇష్టం మేరకే నడుచుకుంటామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఇలా చేయడం ఏమిటని నిలదీశారు. మెుదల స్థలం, ప్యాకేజీ తేలాలే సర్వే చేయాలని డిమాండ్ చేశారు. సర్వే అనంతరం మాట్లాడుతామని తహశీల్దార్ కవితlనచ్చచెప్పినా వినకుండా సర్వేకు వచ్చిన డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, షరీప్, ఎంఆర్‌ఐ కమల్‌సింగ్‌ను తిరిగిపంపించారు. అనంతరం గ్రామస్తులంతా ఆలయం వద్ద సమావేశమై ప్రస్తుతం ఎమ్మెల్యేను కలిసి సమస్యలు వివరించాలని నిర్ణయించారు. అన్యాయం జరిగితే అంతా ఏకమై పోరాడాలని తీర్మానం చేశారు.