అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలతో గుజరాత్‌లోని జామ్‌నగరం సందడిగా మారిపోతోంది. జామ్ నగరం అనంగానే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతా అంబానీల కుమారుడు పెళ్లి జరుగుతున్న ప్రాంతం అని ఠక్కున చెప్పేలా వార్తల్లో నిలిచిపోయింది. ఆ వివాహ వేడుకకు ముందే ఆ నగరంలో ఏకంగా 14 దేవాలయాలను నిర్మించడంతో ఆ నగరం పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకనే ఏకంగా అన్నదానంతో ప్రారంభించడంతో ఆ నగర సమీపంలోని గ్రామాల పేర్లు ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి. . ఈ కార్యక్రమంలో భాగంగా అంబానీల కుంటుంబం ఎంతమందికి బోజనాలందించిందంటే..
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డిండగ్ వేడుకలు వచ్చే నెల మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చెంట్‌తో జులై 12 ఘనంగా వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ముందుగా జరగనున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఇరు కుటుంబాలు అన్నదాన సేవతో ప్రారంభించారు. గుజరాతీ సంప్రదాయ వంటకాలతో స్థానికులకు భోజనాలు పెట్టారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం జయప్రదంగా జరిగేలా స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం అన్నసేవను ప్రారంభించింది.
ఈ అనదానాన్ని జామ్‌నగర్ రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో నిర్వహించారు. ఈ అన్నదాన సేవలో రాధికా మర్చంట్ కుటుంభ సభ్యులు కూడా పాల్గొనడం విశేషం. సుమారు 51 వేల మంది స్థానికులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో భోజనానికి హాజరైన వారంతా జానపద సంగీతాన్ని ఆస్వాదించారు. ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన గాధ్వి తన గాన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
అలాగే ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనే అతిథులకు గుజరాత్‌లోని కచ్ఛ్ లాల్‌పూర్‌కు చెందిన మహిళా కళాకారులు తయారు చేసిన సంప్రదాయ కండువాలను అందజేస్తారు. ఇక ఈ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, భూటాన్ రాణి జెట్సన్ పెమా, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, సౌదీ అరాంకో చైర్‌పర్సన్ యాసిర్ అల్ రుమయ్యన్ ఉన్నారు.
(చదవండి: అనంత్ అంబానీ అధిక బరువుకి కారణం ఇదే! కాబోయే భార్య..!)
Comments
Please login to add a commentAdd a comment