Serve
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు: వేలాదిమందికి అన్నదానం
అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలతో గుజరాత్‌లోని జామ్‌నగరం సందడిగా మారిపోతోంది. జామ్ నగరం అనంగానే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతా అంబానీల కుమారుడు పెళ్లి జరుగుతున్న ప్రాంతం అని ఠక్కున చెప్పేలా వార్తల్లో నిలిచిపోయింది. ఆ వివాహ వేడుకకు ముందే ఆ నగరంలో ఏకంగా 14 దేవాలయాలను నిర్మించడంతో ఆ నగరం పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకనే ఏకంగా అన్నదానంతో ప్రారంభించడంతో ఆ నగర సమీపంలోని గ్రామాల పేర్లు ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి. . ఈ కార్యక్రమంలో భాగంగా అంబానీల కుంటుంబం ఎంతమందికి బోజనాలందించిందంటే.. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డిండగ్ వేడుకలు వచ్చే నెల మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చెంట్‌తో జులై 12 ఘనంగా వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ముందుగా జరగనున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఇరు కుటుంబాలు అన్నదాన సేవతో ప్రారంభించారు. గుజరాతీ సంప్రదాయ వంటకాలతో స్థానికులకు భోజనాలు పెట్టారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం జయప్రదంగా జరిగేలా స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం అన్నసేవను ప్రారంభించింది. ఈ అనదానాన్ని జామ్‌నగర్ రిలయన్స్ టౌన్షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో నిర్వహించారు. ఈ అన్నదాన సేవలో రాధికా మర్చంట్ కుటుంభ సభ్యులు కూడా పాల్గొనడం విశేషం. సుమారు 51 వేల మంది స్థానికులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో భోజనానికి హాజరైన వారంతా జానపద సంగీతాన్ని ఆస్వాదించారు. ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన గాధ్వి తన గాన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అలాగే ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనే అతిథులకు గుజరాత్‌లోని కచ్ఛ్ లాల్పూర్కు చెందిన మహిళా కళాకారులు తయారు చేసిన సంప్రదాయ కండువాలను అందజేస్తారు. ఇక ఈ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, భూటాన్ రాణి జెట్సన్ పెమా, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, సౌదీ అరాంకో చైర్పర్సన్ యాసిర్ అల్ రుమయ్యన్ ఉన్నారు. (చదవండి: అనంత్ అంబానీ అధిక బరువుకి కారణం ఇదే! కాబోయే భార్య..!) -
విలీనగ్రామాల్లో ఇంటెలిజెన్స్ రహస్య సర్వే..!
ఆత్మకూరు(ఎం) : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోటకొండూరు మండలంలో విలీన గ్రామాలైన ఆత్మకూరు(ఎం) మండలంలోని చాడ, కాటెపల్లి, నాంచారిపేట, కొండాపురం, సింగారంలో సోమవారం ఉదయం జిల్లా ఇంటెలిజెన్స్ అధికారులు రహస్య సర్వే నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి 20 నుంచి 30 మందిని కలిసి సమాచారం సేకరించారు. మహిళలు, యువకులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులను కలిసినట్లు సమాచారం. మోటకొండూరు మండలం ఎందుకు వద్దంటున్నారు? ఆత్మకూరు(ఎం) మండలంలోనే ఎందుకు ఉందామనుకుంటున్నారు? తదితర ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఆత్మకూరు(ఎం) మండలం తమకు దగ్గరగా ఉంటుందని, మోటకొండూరు చాలా దూరంగా ఉంటుందని విలీన గ్రామాల వారు అన్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలోనే ఉంచాలని ఇంటెలిజెన్స్ అధికారులకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పలు చోట్ల ప్రజలు మీరు ఎవరు అడగడంతో తాము ఇంటెలిజెన్స్ అధికారులమని, ఉన్నతా«ధికారుల ఆదేశం మేరకు సమాచారం సేకరిస్తున్నామని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. -
సర్వేను అడ్డుకున్న దుబ్బగూడెం గ్రామస్తులు
కాసిపేట : కేకే ఓపెన్‌కాస్టు నిర్వాసిత గ్రామం దుబ్బగూడెంలో చేపడుతున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల గణనను శుక్రవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. స్థలం చూపించిన తరువాత సర్వేలు చేయాలని డిమాండ్ చేశారు. గతం నుంచి సర్వేలను అడ్డుకోగా గ్రామస్తులను ఒప్పించి పునరావాసానికి అనువైన స్థలం చూపిస్తామని చెప్పి అధికారులు కాలం గడుపుతున్నారన్నారు. గ్రామస్తులకు ఇష్టమైన స్థలం చూసుకోమని కోరగా మందమర్రి మంచిర్యాల మధ్యలో అందుగులపల్లి సమీపంలో చూశామన్నారు. ఈ స్థలంపై ఏం చెప్పకుండా సర్వేల పేరుతో రెవెన్యూ అధికారులు గ్రామాలకు రావద్దని, స్థలం సమస్య పరిష్కరించి సర్వేలు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదన్నారు. తహసీల్దార్ కవిత నచ్చచెప్పే ప్రయత్నం చేసిన గ్రామస్తులు వినలేదు. దీంతో అధికారులు సర్వే నిలిపివేసి వెనుతిరిగారు. సర్వేను అడ్డుకున్న దుబ్బగూడెం గ్రామస్తులు, serve, dubbagudem, stop -
దుబ్బగూడెంలో సర్వే అడ్డగింత
స్థలం ఎక్కడ కేటాయిస్తారో చెప్పాలని డిమాండ్ కాసిపేట : మండలంలోని దుబ్బగూడెంలో ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా రెవెన్యూ అధికారులు బుధవారం ప్రారంభించిన సామాజిక ఆర్థిక స్థితిగతుల సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు భూమి ఎక్కడ కేటాయిస్తారు..పరిహారం ఏ విధంగా చెల్లిస్తారో చెప్పకుండా సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించారు. మొదట ఇళ్ల సర్వే పూర్తిచేసి వివరాలన్ని చెబుతామని..గ్రామస్తుల ఇష్టం మేరకే నడుచుకుంటామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఇలా చేయడం ఏమిటని నిలదీశారు. మెుదల స్థలం, ప్యాకేజీ తేలాలే సర్వే చేయాలని డిమాండ్ చేశారు. సర్వే అనంతరం మాట్లాడుతామని తహశీల్దార్ కవితlనచ్చచెప్పినా వినకుండా సర్వేకు వచ్చిన డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, షరీప్, ఎంఆర్ఐ కమల్‌సింగ్‌ను తిరిగిపంపించారు. అనంతరం గ్రామస్తులంతా ఆలయం వద్ద సమావేశమై ప్రస్తుతం ఎమ్మెల్యేను కలిసి సమస్యలు వివరించాలని నిర్ణయించారు. అన్యాయం జరిగితే అంతా ఏకమై పోరాడాలని తీర్మానం చేశారు. -
గల్ఫ్ బాధితులను ఆదుకుంటాం
అనంతపురం అర్బన్ : గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని సమాచార శాఖ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన నీటి పారుదల సలహా మండలి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గల్ఫ్ బాధితులకు సంబంధించిన వివరాలను వారి కుటుంబ సభ్యులు ఏపీఎన్ఆర్ఐ, కలెక్టర్, జిల్లా ఎస్పీ తెలియజేయాలన్నారు. బాధితులు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉంటే అందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఇక్కడికి వచ్చిన వారికి ఉపాధి కూడా చూపిస్తామన్నారు. -
హజ్ యాత్రికులకు సేవ దైవసేవతో సమానం
ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆనందపేట: హజ్ యాత్రికులకు సేవ చేయడం దైవసేవతో సమానం అని ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అన్నారు. హజ్ పిలిగ్రిమ్స్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ స్డేడియం వద్ద ఉన్న అంజుమన్ షాదీఖానాలో శనివారం జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా జిల్లాలో హజ్ యాత్రికులకు సేవ చేస్తున్న హజ్ పిలిగ్రీమ్స్ సర్వీస్ సొసైటీ కార్యవర్గాన్ని అభినందించారు. సొసైటీ అధ్యక్షుడు హజీ మహమ్మద్ రఫీ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ షరీఫ్ శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడుతూ హజ్ యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. హజ్ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియామాలు, హజ్ చేసే విధానం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా యాత్రికులకు వివరించారు. శిక్షణ తరగతులకు హాజరైన వారికి భోజన సదుపాయాలు కల్పించారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ మోమిన్ అహమద్ హుసేన్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్, సభ్యుడు హసన్ బాషా, ముఫ్తి జావీద్, ముఫ్తి రవూఫ్, ముఫ్తి ఫారూఖ్, సొసైటీ కార్యదర్శి రిజ్వాన్, సహాయ కార్యదర్శి బషీర్ అహమ్మద్, మీర్జా గఫ్పార్ బేగ్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎడుకొండల వాడికి సమైక్య సెగ