గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని సమాచార శాఖ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి తెలిపారు.
అనంతపురం అర్బన్ : గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని సమాచార శాఖ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన నీటి పారుదల సలహా మండలి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గల్ఫ్ బాధితులకు సంబంధించిన వివరాలను వారి కుటుంబ సభ్యులు ఏపీఎన్‌ఆర్‌ఐ, కలెక్టర్, జిల్లా ఎస్పీ తెలియజేయాలన్నారు. బాధితులు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉంటే అందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఇక్కడికి వచ్చిన వారికి ఉపాధి కూడా చూపిస్తామన్నారు.