విలీనగ్రామాల్లో ఇంటెలిజెన్స్ రహస్య సర్వే..!
విలీనగ్రామాల్లో ఇంటెలిజెన్స్ రహస్య సర్వే..!
Published Mon, Oct 3 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
ఆత్మకూరు(ఎం) : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోటకొండూరు మండలంలో విలీన గ్రామాలైన ఆత్మకూరు(ఎం) మండలంలోని చాడ, కాటెపల్లి, నాంచారిపేట, కొండాపురం, సింగారంలో సోమవారం ఉదయం జిల్లా ఇంటెలిజెన్స్ అధికారులు రహస్య సర్వే నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి 20 నుంచి 30 మందిని కలిసి సమాచారం సేకరించారు. మహిళలు, యువకులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులను కలిసినట్లు సమాచారం. మోటకొండూరు మండలం ఎందుకు వద్దంటున్నారు? ఆత్మకూరు(ఎం) మండలంలోనే ఎందుకు ఉందామనుకుంటున్నారు? తదితర ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఆత్మకూరు(ఎం) మండలం తమకు దగ్గరగా ఉంటుందని, మోటకొండూరు చాలా దూరంగా ఉంటుందని విలీన గ్రామాల వారు అన్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలోనే ఉంచాలని ఇంటెలిజెన్స్ అధికారులకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పలు చోట్ల ప్రజలు మీరు ఎవరు అడగడంతో తాము ఇంటెలిజెన్స్ అధికారులమని, ఉన్నతా«ధికారుల ఆదేశం మేరకు సమాచారం సేకరిస్తున్నామని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
Advertisement