
టవర్ నిర్మాణం ఆపాలి
విజయనగరం: ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఏర్పాటు చేయ తలపెట్టిన రిలయన్స్ సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులంతా రోడ్లపైకి వచ్చారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గున్నతోటవలసలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల చర్యలకు నిరసనగా గ్రామ శివారులోని గార్డెన్స్ సమీపంలో గ్రామస్తుంలంతా కలిసి ధర్నా నిర్వహించారు. సెలటవర్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ నినాదాలు చేశారు.