Tower construction
-
ఆకాశానికి నిచ్చెనలు వద్దు..ఎత్తయిన భవన నిర్మాణాలకు బ్రేక్
ఆకాశహర్మ్యాలకు పారిస్ పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ దగ్గర్నుంచి ఎన్నో భవంతులు నింగికి నిచ్చెన వేసినట్టుగా ఆకర్షిస్తూ ఉంటాయి. పారిస్ ఇప్పుడు వాటి నిర్మాణానికి బ్రేక్ వేసింది. మొట్టమొదటి ఆకాశాన్నంటే భవనాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్ సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటే భవన నిర్మాణాలు ఇంకా కొన సాగితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై సాధారణ భవనాలదే భవిష్యత్ అన్నది పర్యావరణ వేత్తల మాట. ప్రపంచ పర్యాటక స్వర్గధామం పారిస్. ఫ్యాషన్లకు పుట్టినిల్లయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది కోట్లాదిమంది విదేశీయులు తరలివస్తుంటారు. ఈఫిల్ టవర్, మోపానాసే టవర్, లౌవ్రే పిరమిడ్ వంటి ఆకాశహర్మ్యాలను సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటారు. అంతస్తుల మీద అంతస్తులు నింగికి నిచ్చెనలా వేసుకుంటూ నిర్మించిన భవనాల అందాలు వర్ణించ వీల్లేదు. 330 మీటర్ల ఎత్తైన ఈఫిల్ టవర్ , 210 మీటర్ల ఎత్తయిన మోపానాస్ టవర్ (689 అడుగులు) పారిస్‌కున్న సిటీ ఆఫ్ లైట్స్‌కి ప్రత్యామ్నాయంగా నిలిచాయి. పారిస్‌లో ఎత్తైన భవన నిర్మాణాలు మనకి ఇక కనిపించవు. వాటి నిర్మాణంపై పారిస్ నగర కౌన్సిల్ నిషేధం విధించింది. స్థానికంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కొత్తగా నిర్మించే భవనాలేవైనా 12 అంతస్తులు లేదంటే 37 మీటర్లకు మించకూడదని ఆంక్షలు విధించింది. ఇటీవల కాలంలో అంతటి అందాల నగరం మురికి కూపంలా మారిపోయింది. పారిస్‌కు తిరిగి పూర్వ వైభవం కల్పించాలంటే కాలుష్య కారకమైన ఆకాశహర్మ్యాల నిర్మాణాన్ని నిలిపివేశారు. 18వ శతాబ్దంలో పారిస్ అంటే చిన్న చిన్న ఇళ్లతో చూడముచ్చటగా ఉండేది. ఆ దేశ మొట్ట మొదటి అధ్యక్షుడు నెపోలియన్ –3 రాజధానిపై ఎన్నో కలలు కన్నారు. ఆధునిక, చైతన్యవంతమైన నగరంగా పారిస్‌ను రూపొందించడానికి ప్రత్యేకంగా కొందరు ఇంజనీర్లను నియమించారు. చిన్న చిన్న భవనాలు, ఉద్యాన వనాలు అండర్ డ్రైనేజీ వంటి వ్యవస్థలతో పారిస్ అత్యంత పరిశుభ్రంగా పచ్చదనంతో అలరారేలా మారింది. ఆరు అంతస్తుల రాతి నిర్మాణాలు చూడడానికి అందంగా , నివాస యోగ్యంగా ఉండేవి. ఈఫిల్ టవర్ మినహాయించి మరో ఎత్తైన భవనం లేదనే చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధంలో నగరం చాలా వరకు ధ్వంసం కావడంతో ఆ శిథిలాల నుంచి ఇప్పుడు మనందరం చూస్తున్న సరికొత్త పారిస్ నగరం పుట్టింది. అప్పటికే ఆకాశాన్నంటే భవంతులతో అందరినీ ఆకట్టుకుంటున్న న్యూయార్క్, లండన్ వంటి నగరాల బాటలో పారిస్ నడిచింది. 40 అంతస్తులు, 50 అంతస్తులు, 59 అంతస్తులు ఇలా కట్టుకుంటూ వెళ్లిపోయింది. 1973లో తొలిసారిగా అత్యంత ఎత్తైన మోపానాస్ టవర్ నిర్మాణం జరిగింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెతలా మళ్లీ ఆ నాటి నిర్మాణాల వైపు చూస్తోంది. ప్రజలకి తగ్గిన మోజు రానురాను ప్రజలకీ ఈ హంగు ఆర్భాటాల్లాంటి భవనాలపై మోజు తగ్గింది. మళ్లీ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నాటి పారిస్‌గా మారిపోవాలని వారు కోరుకుంటున్నారు. పైగా అన్నేసి అంతస్తులున్న భవనాల్లో నివాసం మా వల్ల కాదంటూ ఒక దండం పెట్టేస్తున్నారు. ఒకప్పుడు 50 అంతస్తుల భవనం నిర్మిస్తే పై అంతస్తులో నివాసం కోసం ప్రజలు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు వాటికి డిమాండ్ బాగా తగ్గిపోయింది. దీనికి పలు కారణాలున్నాయి. పై అంతస్తుల్లో ఉండే వారిలో ఒంటరితనం వెంటాడుతోంది. సమూహం నుంచి దూరంగా ఉన్న భావన పెరిగిపోయి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంత ఎత్తు నుంచి కిందకి రావడమే ఒక ప్రసహనంగా మారుతోంది. దీంతో నాలుగ్గోడల మధ్య అధికంగా కాలక్షేపం చేయడంతో శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రజలు కూడా ఎత్తైన భవనాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పర్యావరణానికీ దెబ్బే అతి పెద్ద అంతస్తులు పర్యావరణానికి కూడా హానికరంగా మారుతున్నాయి. ఇంధనం వినియోగం విపరీతంగా ఉంటుంది. సాధారణ భవనంలో ప్రతీ చదరపు మీటర్‌కి ఖర్చు అయ్యే ఇంధనానికి ఆకాశహర్మ్యాలలో రెట్టింపు ఖర్చు అవుతుంది. కాలుష్యం 145% అధికంగా విడుదల అవుతుంది. పై అంతస్తులకి నీళ్లు పంప్ చెయ్యడానికి అధికంగా విద్యుత్ వినియోగించాలి. భవనాల నిర్వహణ ఖర్చు కూడా తడిసిమోపెడవుతోంది. ఈ భవన నిర్మాణాలతో ఇంధనం 48% , కర్బన ఉద్గారాలు విడుదల 45% , వ్యర్థాలు 25% వస్తూ ఉంటే నీటి వినియోగం 15% ఉంటోంది. భావితరాలు వినియోగించాల్సిన సహజ వనరుల్ని ఇప్పుడే మనం ఖర్చు చేసేయడంపై పర్యావరణవేత్తల్లో ఆందోళన కూడా నెలకొంది.అందుకే ఇక భవిష్యత్ అంతా సాధారణ భవనాలదేనని పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. చైనా కూడా పారిస్ బాటలోనే నడుస్తూ ఎత్తయిన భవన నిర్మాణాలను నిలిపివేసింది. గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరుగుతూ ఉంటే ఇతర దేశాల్లో అతి పెద్ద నగరాలు కూడా పారిస్ బాటలో నడవక తప్పదు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
రిలయన్స్ జియోకు ట్రిబ్యునల్‌లో విజయం
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన ఆప్టికల్ ఫైబర్, టవర్ వ్యాపారాలను వేరు చేయడాన్ని (డీమెర్జర్) వ్యతిరేకిస్తూ ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫ్రాటెల్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన ఫైబర్, టవర్ వ్యాపారాలను వేరు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అహ్మదాబాద్ బెంచ్ అనుమతి మంజూరు చేసింది. దీనిపై ఆదాయపన్ను శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘డీమెర్జర్ స్కీమ్ ప్రకారం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లను రుణాలుగా మార్చాల్సి ఉంటుంది. ఈక్విటీని డెట్‌గా మార్చడం అన్నది కంపెనీ లా సూత్రాలకు వ్యతిరేకం. అంతేకాదు బదిలీ కంపెనీ (జియోఇన్ఫోకామ్) లాభదాయక లేదా నికర ఆదాయం తగ్గిపోతుంది. ఇది ఆదాయపన్ను విభాగానికి ఆదాయ నష్టాన్ని కలిగిస్తుంది’’ అని ఆదాయపన్ను శాఖ వాదించింది. -
టవర్ నిర్మాణం ఆపాలి
విజయనగరం: ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఏర్పాటు చేయ తలపెట్టిన రిలయన్స్ సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులంతా రోడ్లపైకి వచ్చారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గున్నతోటవలసలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల చర్యలకు నిరసనగా గ్రామ శివారులోని గార్డెన్స్ సమీపంలో గ్రామస్తుంలంతా కలిసి ధర్నా నిర్వహించారు. సెలటవర్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ నినాదాలు చేశారు. -
ఆ చట్టం.. మాకు చుట్టం!
టవర్ల నిర్మాణం కోసం స్థలాల స్వాధీనానికి బ్రిటీషు పాలకులు తెచ్చిన ‘భారతీయ టెలిగ్రాఫ్ చట్టం’ ప్రకారం తమకు అధికారాలున్నాయని విద్యుత్ సంస్థలు ప్రకటనలు జారీ చేస్తున్నాయి. కొత్త నిబంధనలను ఖాతరు చేయకుండా పాత నిబంధనల ప్రకారమే టవర్ల నిర్మాణానికి ఉపక్రమిస్తున్నాయి. ఫలితంగా ‘అనంత’ అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి కొత్త నిబంధనల ప్రకారం ముందుగా భూ యజమానులకు నోటీసులివ్వాలి. లైను వెళ్లే ప్రాంతాల కలెక్టర్ల నుంచి అనుమతి కూడా ట్రాన్స్‌కో తీసుకోవాలి. ఇవేం పాటించకుండా నాటి చట్టంతో అధికారాలున్నాయని చెబుతుండడంపై రైతులు మండిపడుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : బ్రిటీష్ కాలం నాటి చట్టాలను సాకుగా చూపి పవర్ గ్రిడ్ సంస్థలు రైతుల నోట్లో మట్టికొడుతున్నాయి. పొలాల్లో ఇష్టారాజ్యంగా విద్యుత్ టవర్ల నిర్మాణం చేపడుతూ వారికి అన్యాయం చేస్తున్నాయి. రైతుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా టవర్ల నిర్మాణానికి ఉపక్రమిస్తున్నాయి. ఫలితంగా ఒక్కో టవర్ నిర్మాణంలో ప్రతి రైతు మూడున్నర లక్షల నుంచి నాలుగున్న లక్షల రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా కేంద్ర పవర్‌గ్రిడ్ సంస్థ ఏటా వేలాది టవర్లను రాష్ట్రాల మధ్య నిర్మిస్తోంది. ప్రస్తుం అనంతపురం జిల్లాలో 400 కేవీ విద్యుత్ టవర్లను పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ నిర్మిస్తోంది. దీని వల్ల చాలా మంది రైతులు భూములు కోల్పోతున్నారు. జిల్లాలో ఏడాది నుంచి టవర్ల నిర్మాణ పనులు సాగుతున్నా ఎవరికీ పరిహారం ఇవ్వలేదు. నిబంధనలను తుంగలో తొక్కుతూ.. విద్యుత్తు చట్టం-2003 ప్రకారం టవర్ల నిర్మాణానికి విద్యుత్ సంస్థలు అనుసరించాల్సిన సవరణ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం 2006లో విడుదల చేసింది. వాటి ప్రకారం ప్రైవేటు వ్యక్తుల పొలాల్లో విద్యుత్ టవర్లు నిర్మించాలంటే ముందుగా నోటీసు ఇచ్చి అనుమతి తీసుకోవాలి. భూ యజమానులు అభ్యంతరం చెబితే సంబంధిత జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి, కలెక్టర్ నిర్ణయించిన ధర మేరకు రైతుకు నష్టపరిహారం చెల్లించి కొనుగోలు చేయాలి. ఆ తర్వాత మాత్రమే టవర్ల నిర్మాణం చేపట్టాలి. కానీ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ పొలాల్లో టవర్ల నిర్మాణం చేపడుతోంది. ‘అనంత’ రైతులకు భారీగా నష్టం అనంతపురం జిల్లాలో 2003 నుంచి భూములకు నష్టపరిహారం పొందనివారు, తక్కువ పరిహారంతో తీవ్రంగా నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ కింద కొత్తగా తాడిపత్రి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పామిడి, వజ్రకరూర్, ఉరవకొండ మండలాల్లో 620 కేవీ టవర్ల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో రైతులు 3100 ఎకరాలు నష్టపోయే ప్రమాదముంది. పంట నష్టం జరిగితే రూ.25 వేలు చొప్పున పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం మినహా చట్టం ప్రకారం రైతులకు దక్కాల్సిన పరిహారాన్ని అందించడం లేదు. నిబంంధనల ప్రకారం దక్కాల్సిన పరిహారం ఇది: టవర్ నిర్మించిన స్థలానికి ప్రధాన రహదారి పక్కనున్న పొలాలైతే గజానికి రూ.1000, రోడ్డుకు దూరంలో ఉన్న పొలాలైతే గజానికి రూ.100 పరిహారం చెల్లించాలని పాత నిబంధనలు ఉన్నాయి. ఒక టవర్ నుంచి మరో టవర్ వరకూ విద్యుత్ తీగలు వెళ్లే స్థలానికి కూడా మీటరుకు రూ.65 చొప్పున పరిహారం చెల్లించాలి. ఇది చాలా తక్కువని ఇటీవల తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో హైవేకు అర కిలోమీటరు దూరంలో ఉంటే ఒక్కో టవర్ ఏర్పాటుకు రూ. 3.50 లక్షలు (350చదరపు అడుగులు) నుంచి రూ.4.50 (350 చదరపు అడుగుల కంటే ఎక్కువ) ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే ఇతర పొలాలు, స్థలాల్లో టవర్ ఏర్పాటుకు రూ.2.45 లక్షల నుంచి రూ.3.15 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పరిహారం కృష్ణా, గుంటూరు, నెల్లూరులో ఇస్తున్నారు. అలాగే తెలంగాణలోని వరంగల్, నల్గొండ జిల్లాలో పరిహారం ఇచ్చారు. ఇదే క్రమలో ప్రస్తుతం చిత్తూరులో జరుగుతున్న టవర్ల నిర్మాణంలో కూడా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు, రైతులకు మధ్య వివాదం రేగుతోంది. రేపు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు ప్రణాళిక టవర్ల నిర్మాణంలో జరుగుతున్న అన్యాయంపై రైతులు కూడా ధర్నాకు ఉపక్రమించేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు తరిమెల శరత్‌చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్‌క్లబ్‌లో రైతులు, రైతు సంఘాల నాయకులతో చర్చావేదిక కూడా చేపట్టారు. దీనికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రైతు సంఘం నేతలు హాజరుకు కానున్నారు. -
రైతులపై పవర్ ప్రతాపం
గంగాధర నెల్లూరు మండలంలో పవర్ గ్రిడ్ భూ బాధితులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను అధికారులు అణచివేశారు. రైతుల డిమాండ్లను తుంగలో తొక్కేశారు. పోలీసు బందోబస్తుతో గురువారం పవర్‌గ్రిడ్ పనులు చేపట్టారు. అడ్డొచ్చిన 10 మంది రైతులను అరెస్టు చేశారు. రైతుల శాపనార్థాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. గంగాధరనెల్లూరు / సాక్షి, చిత్తూరు: వేల్కూరు, పెద్దకాల్వ, కొట్రకోన పంచాయతీల్లో హై టెన్షన్ విద్యుత్ లేన్ల ఏర్పాటు కారణంగా భూములు కోల్పోయిన రైతులు నష్ట పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ మూడు నెలలుగా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నామమాత్రంగా నష్టపరిహారం చెల్లించి పవర్‌గ్రిడ్ అధికారులు చేతులు దులుపుకున్నారని ఆరోపిం చారు. వారం రోజుల క్రితం సైతం చిత్తూరు ఆర్డీవో పెంచలకిషోర్, చిత్తూరు డీఎస్పీ లక్ష్మినాయుడు ఆధ్వర్యంలో రైతులతో చర్చలు జరిపారు. జిల్లా అధికారులు సైతం దీనికి కమిటీ వేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో బాధిత రైతుల గోడును పక్కన పెట్టి గురువారం పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరింపచేసి పవర్‌గ్రిడ్ పనులు చేపట్టారు. అడ్డొచ్చిన 10 మంది రైతులను అరెస్టుచేసి పోలీసు కేసులు పెట్టారు. అరెస్టరుున వారిలో జయదేవనాయుడు, అశోక్‌నాయుడు, బాలకృష్ణమూర్తి, విజయకుమార్, సుబ్రమణ్యంనాయుడు, సుధాకర్‌నాయుడు, నాగరాజులునాయుడు, భూలక్ష్మి, సుమిత్ర, రాణి ఉన్నారు. చిత్తూరు డీఎస్పీ లక్ష్మినాయుడు సహా పలువురు సీఐలు, ఎస్ఐలు, వంద మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ సుశీలమ్మ, ఆర్ఐలు దొరబాబు, రవి, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి హాజరయ్యారు. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి న్యాయం అంటూ పెద్దకాల్వకు చెంది న భూలక్ష్మి రోదించడం పలువురిని కలచి వే సింది. పెద్దకాల్వ పంచాయతీలో ఆమెకు సం బంధించిన భూముల్లో హై టెన్షన్ విద్యుత్ లేన్ వెళుతోంది. గురువారం భూలక్ష్మికి చెందిన పొ లాల్లో అడ్డుగా ఉన్న నెల్లికాయచెట్లను, కొబ్బరి చెట్లను నరికి వేశారు. చెట్ల వద్దకు వెళ్లి భూలక్ష్మి రోదించింది. దీంతో ఎక్కడ ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమెను శాంతింపజేశారు. చిత్తూరు తాలూకా పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా పరిహారం ఇవ్వాలని అడిగినందుకు పవర్‌గ్రిడ్ వారు పోలీసు బలగాలతో దౌర్జన్యానికి దిగి రైతులను అరెస్టులు చేసి చిత్తూరు తాలూకా పోలీసు స్టేషన్లో ఉంచారనే విషయం తెలుసుకుని వేల్కూర్,పెద్దకాల్వ, కొట్రకోన ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పోలీసుస్టేషన్లో ఉన్న రైతులకు మద్దతుగా స్టేషన్ బయట ధర్నా చేపట్టారు. హై టెన్షన్ లేన్ నిర్మాణం వల్ల బోర్లు, పొలాలు, మామిడి చెట్లతో పాటు పలు పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయినట్లు పెద్దకాల్వకు చెందిన మహిళా రైతులు సీ.మల్లిక, పీపీ ఆగ్రహారానికి చెందిన వళ్లియమ్మ వాపోయారు. బోర్లు,మామిడి తోటలు తెగనరికారని తెలిపారు. పెద్ద ఎత్తున నష్టపోయినా అధికారులు టవర్ నిర్మాణం పరిధిలో దెబ్బతిన్న పంటలకు మాత్రమే పరిహారం ఇస్తామని చెబుతున్నారని పలువురు రైతులు పేర్కొన్నారు. నెల్లూరులో మంచి పరిహారం ఇచ్చి ఇక్కడ మాత్రం ససేమిరా అంటున్నారని వారు చెప్పారు. సరైన పరిహారం ఇచ్చేవరకూ ఆందోళన ఆపేది లేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ రైతులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు కిషాన్‌సంగ్ మద్దతు పలికింది. ధర్నా విరమించాలని పోలీసులు కోరినా రైతులు కొనసాగించారు. అరెస్టయిన రైతులను సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పోలీసులు గ్రామపెద్దల పూచీకత్తుపై విడుదల చేశారు.