కోమాలో ఉన్నా.. ప్రేమ ఆగలేదు
ముఫ్ఫై ఏళ్ళుగా ఆమెకు భర్తే లోకం... అతడికి సపర్యలు చేయడమే ఆమె జీవితం. మోకాలి నొప్పితో సర్జరీ చేయించుకున్న మాజీ ఫ్రాన్స్ ఫుట్ బాల్ ఆటగాడు జీన్ ఫిర్రే ఆడమ్స్ జీవితం.. అనూహ్యంగా తల్లకిందులైంది. సర్జరీ తర్వాత బుద్ధి మందగించి, కోమాలోకి జారుకున్న అతడు నేటికీ మంచానికే పరిమితమయ్యాడు. అయితేనేం ఆయన భార్య బెర్నెడెట్ మాత్రం అతడి సేవే జీవితంగా గడుపుతోంది. అన్యోన్య దాంపత్యానికి, ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
భర్త మంచాన పడిన నాటినుంచి బెర్నాడెట్ అతనిని వీడింది లేదు. పంచ ప్రాణాలు అతనిపైనే పెట్టుకొని రేయింబవళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. 1982 లో తలకిందులైన జీన్ పిర్రే.. నేటికీ కోలుకోలేదు. ముఫ్ఫై మూడేళ్ళ క్రితం మోకాలినొప్పితో సాధారణ సర్జరీకోసం ఆస్పత్రిలో చేరిన జీన్ పిర్రే తిరిగి కోలుకోలేదు. కానీ ఆయన భార్య బెర్నాడెట్ మాత్రం ముఫ్ఫై ఏళ్ళుగా అత్యంత ప్రేమతో ఆయనకు సేవలు అందిస్తూనే ఉంది. పుట్టినరోజైనా, క్రిస్మస్ పండుగైనా, ఫాదర్స్ డే అయినా జీన్ పిర్రేకు అందరితో సమానంగా బహుమతులను అందిస్తుంది. కోమాలో ఉండి, ఏమాత్రం స్వవిషయాలు పట్టని అతడిపట్ల ఎంతమాత్రం నిర్లక్ష్యం చూపకుండా అత్యంత ప్రేమతో, ఆప్యాయంగా సేవలు అందిస్తోంది.
జీన్ ఫిర్రేకు ఇప్పుడు అరవై ఏడేళ్ళు. ఆస్పత్రిలో ఉండేలాంటి మాడిఫైడ్ బెడ్ పై తన రూమ్ లో పడుకొని, ఒక్క ఊపిరి మాత్రం స్వయంగా తీసుకుంటాడు. ఆయనకు సంబంధించిన మిగిలిన పనులన్నీ భార్య బెర్రాడెట్ చూసుకోవలసిందే. విసుగూ విరామం లేకుండా.. ముఫ్ఫై ఏళ్ళుగా ఆమె అదే ప్రేమతో జీన్ కు సేవలు అందించడం... భార్యాభర్తల బంధానికి నిలువెత్తు నిరద్శనంగా నిలుస్తుంది. ఆ దంపతుల అమితమైన ప్రేమకు తార్కాణంగా కనిపిస్తుంది. ఫ్రాన్స్ నిమెస్ సమీపంలో నివాసం ఉంటున్న బెర్నెడెట్.. ఏ వేడుకైనా జీన్ పెర్రె కు బహుమతిగా ఓ టీ షర్లు కొంటుంది. అతడికి ప్రతిరోజూ బెడ్ పైనే టీ షర్లు మారుస్తుంటుంది. ఎప్పుడూ ఆయన రూమ్ శుభ్రంగా ఉండేట్టు చూసుకుంటుంది. గదిని అందంగా అలకరించడంతోపాటు, సువాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలను కూడ జీన్ ఫెర్రే కోసం కొనుగోలు చేస్తానని చెప్పడం ప్రేమైక జీవనానికి మచ్చుతునకగా చెప్పాలి.
1970ల్లో ఫ్రాన్స్ అంతర్జాతీయ ఆటగాడైన జీన్ పెర్రే మోకాలి శస్త్ర చికిత్స తెచ్చిన అనంతమైన మార్పుతో మంచానికే పరిమితమైపోయాడు. ఆహారం అరుగుదలతోపాటు, కళ్ళు తెరవడం మూయడం తప్ప ఏమీ చేయలేని స్థితికి చేరుకున్నాడు. అయితేనేం అతని భార్య బెర్నాడెట్ ఏమాత్రం అతన్ని నిర్లక్ష్యం చేయలేదు. జీవిత భాగస్వామి అంటే అర్థాన్ని చెబుతూ ప్రతిరోజూ స్నాన పానాదులు చేయించడం, బట్టలు తొడగడం, భోజనం పెట్టడంతోపాటు అతనికి బెడ్ సోర్స్ వంటి ఇతర వ్యాధులు సోకకుండా అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఒక్కోసారి అతడు మేల్కొనే సమయాన్ని గుర్తించడంకోసం ఆమె నిద్రపోకుండా రాత్రంగా మెలకువగానే ఉంటుంది. జీన్ ఫెర్నే ను వదిలి బెర్నాడెట్ అత్యంత అవసరమైతేగాని బయటకు వెళ్ళదు. తప్పని పరిస్థితిలో ఒకరోజు గడపాల్సి వచ్చినపుడు కేర్ టేకర్లకు అప్పగించి వెడుతుంటుంది. అయితే ఆ సమయంలో అతని మానసిక స్థితిలో తీవ్రమైన మార్పు ఉంటుందని వారు చెప్పడం... ఆ దంపతుల మధ్య సాన్నిహిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.
జీన్ ఫెర్రేకు సపర్యలు చేస్తున్నపుడు, ఆహారం తినిపిస్తున్నపుడు అతనిలోని భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయని చెప్తుంది బెర్నాడెట్. 46 ఏళ్ళ బెర్నడెట్ గత ముఫ్ఫై ఏళ్లుగా తన భర్త ఏ క్షణంలోనైనా కోలుకుంటాడేమోనని ఎదురు చూస్తూనే ఉంది. ఒక్క క్షణం కూడ అతన్ని విడవకుండా కనిపెట్టుకొని ఉంటోంది. తాను సపర్యలు చేస్తుంటే జీన్ స్పర్శను ఫీలౌతున్నారని, అలాగే తన స్వరాన్ని కూడ జీన్ తప్పక గుర్తిస్తాడని ఆశతో ఎదురు చూస్తోంది.