న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో బంధుప్రీతి, అశ్రిత పక్షపాతానికి స్వస్తి పలకాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు జూనియర్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు ముఖాముఖిలను(ఇంటర్వ్యూలు) నిర్వహించే విధానానికి శుభంకార్డు వేయాలని సిబ్బంది వ్యవహారాల శాఖ ఆలోచన చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభంకానున్న కొత్త విధానంలో నైపుణ్య పరీక్షలు, ఫిజికల్ టెస్టులు వంటివి ప్రత్యేకంగా ఉండకపోవచ్చని సమాచారం. దీని ప్రకారం రాతపూర్వక పరీక్షల్లో మాత్రమే అభ్యర్థులు తమ ప్రతిభను కనబరుచుకోవాల్సి ఉంటుంది.
ఒక వేళ తప్పకుండా ఆ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూ అని భావిస్తే మాత్రం సిబ్బంది వ్యవహారాలశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ నియామకాల్లో భారీ అవినీతి జరుగుతుందని, ఇంటర్వ్యూల పేరిట బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం జరుగుతుందని, దానికి స్వస్తి పలకాలని ప్రధాని మోదీ జెండా వందనం సందర్భంగా ఎర్రకోటపై ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూలను రద్దు చేయడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని ప్రధాని చెప్పారు.
'ఇంటర్వ్యూలకు స్వస్తి!'
Published Wed, Sep 30 2015 9:19 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
Advertisement
Advertisement