job interviews
-
13 మందిపై అత్యాచారం, వీడియో రికార్డింగ్.. బాలేశ్ ధన్కర్ అకృత్యాలు
సిడ్నీ: ఉద్యోగాల పేరుతో ఇంటర్వ్యూలకు పిలిచి, మత్తు కలిపిన డ్రింక్స్ తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు.. ఆ దురాగతాలను వీడియో రికార్డింగ్ చేసేవాడు. కొరియా మహిళలంటే ఇతడికి పిచ్చి. బాధితుల్లో వీరే ఎక్కువమంది. వీరి పేర్లు, వివరాలను దాచుకున్నాడు. అతడి గదిలో బెడ్ పక్కనే అలారం క్లాక్‌లోని సీక్రెట్ కెమెరా ద్వారా అన్నీ రికార్డయ్యేవి...ఇవన్నీ ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్ ధన్కర్ అకృత్యాలు. 2018 జనవరి– అక్టోబర్కాలంలో ఇతడు 13 మంది ఇతడు మహిళలను రేప్ చేశాడు. 2018 అక్టోబర్‌లో పోలీసులు ఇతడి సొంత ఫ్లాట్‌తోపాటు ఓ హోటల్ గదిలో సోదాలు జరపగా మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్ బాటిళ్లు, రేప్ దృశ్యాలు, మహిళలతో ఏకాంతంగా ఉండగా తీసిన మొత్తం 47 వీడియోలతో హార్డ్‌డ్రైవ్ దొరికింది. బాలేశ్ నేరాలపై న్యూసౌత్ వేల్స్ జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. కొన్ని వీడియోల్లోని అసహ్యకర దృశ్యాలను జడ్జీలు కూడా చూడలేకపోయారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
మోర్తాడ్: వలస కార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పరిధిలోని ఏడీఎన్‌హెచ్ కంపాస్ కంపెనీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ సంస్థలో క్లీనింగ్ సెక్షన్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఫ్రీ రిక్రూట్మెంట్కు శ్రీకారం చుట్టింది. కార్మికులకు ఉచిత వీసాలతోపాటు విమాన టికెట్ చార్జీలను కూడా ఆ సంస్థే భరించనుంది. జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న జగిత్యాలలోని హోటల్ పీఎం గ్రాండ్లో, 15న నిజామాబాద్‌లోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి కోలుకుంటున్న తరుణంలో వలస కార్మికులపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా ఉచితంగా వీసాలను జారీ చేయడానికి ఏడీఎన్‌హెచ్ కంపెనీ ఫ్రీ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించడం ఇది రెండోసారి. క్లీనర్లుగా పని చేసే కార్మికులకు ప్రతి నెలా రూ.20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఉచిత వసతి, భోజనం లేదా అలవెన్సుల రూపంలో అదనంగా చెల్లిస్తారు. వలస కార్మికులను ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించడానికి రవాణా సదుపాయాన్ని కూడా కంపెనీయే కల్పించనుంది. ఉచితంగా జారీ చేస్తున్న వీసాలకు కార్మికులు ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఏడీఎన్‌హెచ్ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని యాజమాన్యం స్పష్టం చేసింది. కాగా, కష్టాల్లో ఉన్న వలస కార్మికులకు మేలు చేసేందుకు యూఏఈ కంపెనీ ఉచిత వీసాలు, విమాన టికెట్లను జారీ చేస్తుండడం హర్షించదగ్గ విషయమని పలువురు వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: రెవెన్యూలో పదోన్నతులు!) -
'ఇంటర్వ్యూలకు స్వస్తి!'
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో బంధుప్రీతి, అశ్రిత పక్షపాతానికి స్వస్తి పలకాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు జూనియర్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు ముఖాముఖిలను(ఇంటర్వ్యూలు) నిర్వహించే విధానానికి శుభంకార్డు వేయాలని సిబ్బంది వ్యవహారాల శాఖ ఆలోచన చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభంకానున్న కొత్త విధానంలో నైపుణ్య పరీక్షలు, ఫిజికల్ టెస్టులు వంటివి ప్రత్యేకంగా ఉండకపోవచ్చని సమాచారం. దీని ప్రకారం రాతపూర్వక పరీక్షల్లో మాత్రమే అభ్యర్థులు తమ ప్రతిభను కనబరుచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ తప్పకుండా ఆ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూ అని భావిస్తే మాత్రం సిబ్బంది వ్యవహారాలశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ నియామకాల్లో భారీ అవినీతి జరుగుతుందని, ఇంటర్వ్యూల పేరిట బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం జరుగుతుందని, దానికి స్వస్తి పలకాలని ప్రధాని మోదీ జెండా వందనం సందర్భంగా ఎర్రకోటపై ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూలను రద్దు చేయడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని ప్రధాని చెప్పారు. -
కిడ్నీ రాకెట్లో మరో కొత్త కోణం
జాబ్ పేరుతో యువకుడికి ఎర వైద్య పరీక్షలని నమ్మించి.. కొలంబోలో కిడ్నీ కాజేత దినేష్ మృతితో మరో యువకుడి ఉదంతం వెలుగులోకి.. బాధితుడు వస్తే వాంగ్మూలం రికార్డు చేస్తాం: సీసీఎస్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: కిడ్నీ రాకెట్ కేసులో మరో కొత్త కోణం.. జాబ్ ఇంటర్వ్యూ పేరుతో కొలంబో పిలిపించుకుని, వైద్యపరీక్షల పేరుతో కిడ్నీ దోచుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా లింగంపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, రాణి దంపతుల కుమారుడు మాదాసి కిరణ్ (24) ఇంటర్ పూర్తి చేసి ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్లికర్, టైమ్స్ జాబ్ వెబ్సైట్లను పరిశీలిస్తుండగా.. ఉస్మానియా కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ ఉందని యాడ్ కనిపించింది. వారిని సంప్రదించగా పాస్‌పోర్ట్ తీసుకొని చెన్నైకి రావాలని చెప్పారు. గతనెల 23న కిరణ్ చెన్నై వెళ్లి ఆ కంపెనీ ప్రతినిధులను కలిశాడు. జాబ్‌కు సంబంధించి పది రోజుల ట్రైనింగ్ కోసమని అతడిని కొలంబో తీసుకెళ్లారు. ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పి అతడిని అదే నెల 29న ఉదయం 7.30కి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెళ్లగానే ఏదో ఇంజక్షన్ ఇవ్వడంతో సృ్పహ కోల్పోయాడు. మధ్యాహ్నం 12 గంటలకు స్పృహలోకి వచ్చిన కిరణ్ తనకు ఏం జరిగిందని అడగ్గా.. బాత్రూంలో జారిపడ్డావని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఉద్యోగానికి సెలక్ట్ అయ్యావని, టీఏ, డీఏలతో కలిపి నెలకు రూ.25 వేల జీతం వస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో జాబ్ చేయాల్సి ఉంటుందని, నీ ఈ-మెయిల్‌కు త్వరలో అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తామని చెప్పి రూ.2 వేల డాలర్లు ఇచ్చి అతడిని స్వగ్రామానికి పంపించారు. అపాయింట్‌మెంట్‌లెటర్ కోసం ఎదురు చూస్తున్న కిరణ్‌కు... కిడ్నీ అమ్మేందుకు కొలంబో వెళ్లి మృత్యువాత పడిన కొత్తగూడెంవాసి దినేష్ ఉదంతం పేపర్లలో కనిపించింది. దినేష్ ఫొటోను గుర్తించిన కిరణ్.. అతను కూడా తనతో పాటు కొలంబో రూమ్‌లో కనిపించాడని ‘న్యూస్‌లైన్’కు చెప్పాడు. ఆ రూమ్‌లో తమతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన పది మంది యువకులు ఉన్నారని, అయితే తనలాగే వారు కూడా జాబ్ కోసం వచ్చారని భావించానని కిరణ్ తెలిపాడు. దినేష్ ఉదంతం తెలిసిన వెంటనే అనుమానంతో తాను వైద్యుడికి చూపించుకోగా.. తన కిడ్నీ కూడా కొలంబోలో కాజేసినట్టు బయటపడిందని కిరణ్ కన్నీరుపెట్టుకున్నాడు. బాధితుడు ముందుకొస్తే అతని స్టేట్మెంట్ రికార్డు చేస్తామని సీసీఎస్ పోలీసులన్నారు. ఇదిలా ఉండగా, దినేష్ కేసులో గుంటూరుకు చెందిన కిషోర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు ఆచూకీ కూడా పోలీసులకు లభించింది. వీరిచ్చిన సమాచారంతో ఓ పోలీసు బృందం చెన్నైకి వెళ్లింది. ప్రధాన నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.