మాట్లాడుతున్న చండ్ర అరుణ
-
పీఓడబ్ల్యూ రాష్ట్ర నేతలు చండ్ర అరుణ. ఝాన్సీ
రేగళ్ల (కొత్తగూడెం రూరల్): ఎన్నో ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న మహిళలపై దాడులు ఆపాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ, ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేగళ్ళ పంచాయతీలోని బాబోజితండా, చంద్రాలగూడెం, పగడాయిగూడెం, తోకబందాల తదితర గ్రామాలలో మంగళవారం పర్యటించారు. వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్న మహిళల నుంచి భూములను లాక్కునేందుకే హరిత హారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. పేద దళితులు, గిరిజనుల కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని విస్మరించి; పోడు భూములను బలవంతంగా లాక్కునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. పోడు సాగుదారులకు పట్టాలివ్వాలని, దాడులు ఆపాలని, అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్.శిరోమణి, నాయకులు గోకినపల్లి లలిత, వై.సావిత్రి, ఎంపీటీసీ సభ్యుడు వాంకుడోత్ కోబల్ తదితరులు పాల్గొన్నారు.