
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహిళల భద్రతపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు. రాష్ట్రంలో వరుసగా అత్యాచార ఘటనలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, మాజీ మంత్రి సబిత ట్విట్టర్ వేదికగా.. తెలంగాణలో ఏం జరుగుతోంది. అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కూడా కాలేదు. రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరగడం బాధాకరం. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరం. మహిళలకు భద్రత కరువైంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
1. వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారం
2. ఓయూ పీఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం
3. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై అత్యాచారం
4. నిర్మల్ నుండి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్.
— Sabitha Reddy (@BrsSabithaIndra) July 31, 2024