వాళ్లు ఆడబిడ్డలు కాదా.. మంత్రి కొండా సురేఖకు సబిత కౌంటర్‌ | Sabitha Indra Reddy Political Counter To Minister Konda Surekha | Sakshi
Sakshi News home page

వాళ్లు ఆడబిడ్డలు కాదా.. మంత్రి కొండా సురేఖకు సబిత కౌంటర్‌

Published Wed, Oct 2 2024 3:35 PM | Last Updated on Wed, Oct 2 2024 4:14 PM

Sabitha Indra Reddy Political Counter To Minister Konda Surekha

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎ‍మ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కౌంటరిచ్చారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. కేటీఆర్‌ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి.

మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ గారి అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించినారా? బాధ్యతగల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడటం బాధాకరం’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

 

ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement