సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ హామీలను నమ్మి ఆడబిడ్డలు ఓటేశారని.. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం మాట్లాడటం లేదు.. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అంటూ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
‘‘అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్ ఇవ్వడం లేదు. నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడ్డా మైక్ ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తామని చెప్పినా మాట్లాడనివ్వలేదు. శాడిస్ట్‌లాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తమంటుంది. నోటి మాటల్లో కాదు నిజంగా చేసే దమ్ముందా?’’ అని సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు.
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నాలుగు గంటలు నిలబడ్డా కనీసం మాకు మైక్ ఇవ్వలేదంటూ మండిపడ్డారు. జూనియర్ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించటం బాధగా ఉంది. ఇద్దరు మహిళ మంత్రులు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదు? మేము మాట్లాడి రెండు రోజులు అవుతుంటే ఎందుకు స్పందించటం లేదు.మహిళా మంత్రులు బాధ్యత కాదా?’’ అంటూ సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment