విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేత, విలీనాన్ని నిలిపివేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
-
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి
విద్యారణ్యపురి : విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేత, విలీనాన్ని నిలిపివేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఆదివారం హన్మకొండలోని టీఎన్‌జీవోస్ భవన్‌లో నిర్వహించిన ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య ప్రారంభించాలన్నారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానం చేయాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలను సెమీరెసిడెన్షియల్‌గా, ఉన్నత పాఠశాలలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని కోరారు. విద్యాపరిక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు ఎ.నర్సింహారెడ్డి మాట్లాడుతూ విద్య కాషాÄæూకరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. నూతన విద్యావిధానం కమిటీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ సిఫారసులు ప్రభుత్వ విద్యకు గొడ్డలిపెట్టుగా ఉన్నాయన్నారు. వీటన్నింటినీ నిరసిస్తూ ఈనెల 25న విద్యాపరరిక్షణ కమిటీ ఆ««దl్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నా విజయవంతం చేయాని పిలుపునిచ్చారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ రమేష్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.అశోక్, జి,నటరాజ్, టి.పురుషోత్తమ్, కె.సునంద, ఎస్.గోవర్ధన్, డి.శ్రీనివాస్, పి.చంద్రం పాల్గొన్నారు.