భారత్కు ఆర్థికసాయాన్ని నిలిపేస్తున్న బ్రిటన్ | UK to stop financial aid to India | Sakshi
Sakshi News home page

భారత్కు ఆర్థికసాయాన్ని నిలిపేస్తున్న బ్రిటన్

Published Thu, Dec 31 2015 10:51 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

UK to stop financial aid to India

న్యూఢిల్లీ: భారత్లోని వెనుకబడిన రాష్ట్రాలలో విద్య, వైద్యం లాంటి మౌలిక వసతుల అభివృద్ధి కోసం బ్రిటన్ దీర్ఘకాలంగా కేటాయిస్తున్న నిధులను జనవరి 1 నుంచి నిలిపివేయనుంది.  ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను మాత్రం పూర్తిచేయనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. మిగిలిపోయిన నిధులను సాంకేతిక సహాయంలో భాగంగా అందించనున్నట్లు తెలిపింది. 2013-15 మధ్య కాలంలో ఒడిషా, బిహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం బ్రిటన్ నుంచి సుమారు రూ. 850 కోట్ల ఆర్థిక సహాయాన్ని భారత్ పొందింది.

గతంలో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలకు భారత్ కేటాయిస్తున్న నిధుల్లో బ్రిటన్ అందించే సహాయం వాటా చాలా తక్కువని, ఆ నిధులు లేకపోయినా భారత్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలదని వ్యాఖ్యానించారు. అప్పట్లో ప్రణబ్ వ్యాఖ్యలపై బ్రిటన్లో పెద్ద దుమారమే రేగింది.

బ్రిటన్ భారత్కు అందిస్తున్న స్వల్పసాయం పట్ల ఆ దేశ పార్లమెంట్లో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్ కు అందిస్తున్న సహాయాన్ని 2016 జనవరి 1 నుంచి నిలిపివేయడానికి బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాలకు గాను ఐదు అంశాలలో సహకారానికి బ్రిటన్తో భారత్ ఒప్పందం కుదుర్చకుంది. ఇందులో వ్యవసాయ రంగంలో సాంకేతిక సహకారంతో  పాటు పట్టణ మౌలిక వసతులు, శక్తి వనరుల పెంపు తదితర అంశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement