finacial aid
-
శభాష్ భారత్.. మోదీ సర్కార్‌పై చైనా ప్రశంసలు
ఇటీవల కాలంలో భారత్, చైనా మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కానీ, కొన్ని సందర్భాల్లో భారత్‌పై చైనా ప్రశంసలు కురిపించింది. కొద్దిరోజుల క్రితం.. గోధుమల ఎగుమతులపై భారత్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ జీ-7 దేశాలపై మండిపడ్డ చైనా.. మరోసారి ఇండియాను ప్రశంసించింది. వివరాల ప్రకారం.. ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందించింది. డీజిల్, ఆహార ధాన్యాలను మోదీ సర్కార్ లంకకు పంపించింది. ఈ నేపథ్యంలో భారత్ అందిస్తున్న సహాయ సహకారాలను డ్రాగన్ కంట్రీ చైనా మెచ్చుకుంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ.. శ్రీలంక విషయంలో భారత ప్రభుత్వం అందించిన సాయం ప్రశంసనీయం. భారత్ ప్రయత్నాలను చైనా అభినందిస్తోంది. శ్రీలంక, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు వీలైనంత తర్వగా కష్టాల నుంచి బయటపడేందుకు సహాయం చేయడానికి భారత్, ఇతర అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇక, లంక విషయంలో చైనా కూడా తమ వంతు కృషి చేస్తోందని తెలిపారు. శ్రీలంకకు సాయం అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తోందని చెప్పారు. చైనా సామర్థ్యం మేరకు శ్రీలంక సామాజిక ఆర్థిక అభివృద్ధికి మద్దతిచ్చాం. శ్రీలంక కోసం 500 మిలియన్ విలువైన అత్యవసర మానవతా సహాయాన్ని చైనా ప్రకటించిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. చైనా సాయం విషయంలో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆవేదన వ్యక్తం చేశారు. లంక కోసం ఒక బిలియన్ డాలర్ల రుణం కోసం చైనాకు చేసిన అభ్యర్థనను ఆ దేశం పట్టించుకోలేదని అన్నారు. అలాగే, చైనా నుంచి 1.5 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్‌ను శ్రీలంక పొందలేకపోయిందని తెలిపారు. ఇది కూడా చదవండి: వంతెన ఓపెనింగ్‌లో విషాదం.. అధికారుల బొక్కలు విరిగాయి.. వీడియో -
ఆటకు ఆర్థిక అండ... దాదాపు రూ.9.60 కోట్ల నగదు ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు క్రీడాకారులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. మూడేళ్ల కాలంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించిన 1,500 మంది క్రీడాకారులకు రూ.9,59,99,859 నగదు ప్రోత్సాహకాలను అందజేసింది. సుమారు 80 క్రీడాంశాల్లోని ఆటగాళ్ల ప్రతిభకు పట్టంకడుతూ.. వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా శిక్షణకు అవసరమైన ఆర్థిక సాయానిచ్చింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక విధానమంటూ లేకపోవడంతో చాలామంది క్రీడాకారులు నష్టపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ క్రీడాప్రోత్సాహకాలను ప్రవేశపెట్టారు. గతంలో ఇచ్చే నగదు మొత్తాన్ని భారీగా పెంచారు. ఇందులో భాగంగానే జాతీయ పోటీల్లో పతకాలు గెలుపొందిన క్రీడాకారులకు రూ.4.58 కోట్లు ఇవ్వడం విశేషం. దీంతో 2014–19 మధ్య కాలంలో పతకాలు సాధించినా అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఎందరో క్రీడాకారులకు లబ్ధిచేకూరింది. ఎన్నికల ముందు హడావుడిగా.. టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.13.76 కోట్లు అందించినప్పటికీ చిన్న క్రీడాకారులకు ఏమాత్రం మేలు జరగలేదు. క్రీడలను కూడా రాజకీయాలతో చూసే చంద్రబాబు ఎన్నికలకు ముందు హడావుడిగా 2018–19లో 115 మందికి రూ.7.75 కోట్లు ఇచ్చారు. అంతకుముందు ఇచ్చింది కేవలం రూ.6 కోట్లు అయితే వీటిల్లో సింహభాగం అంతర్జాతీయ క్రీడాకారులకు కేటాయించినదే కావడం గమనార్హం. జాతీయస్థాయిలో పతకాలు పొందినవారికి నామమాత్రంగా ఆర్థిక సాయం దక్కేది. (చదవండి: ఉద్యాన విస్తరణకు డిజిటల్ సేవలు) -
అస్తవ్యస్ధంగా ఏపీ ఆర్ధిక పరిస్ధితి
-
భారత్‌కు ఆర్థికసాయాన్ని నిలిపేస్తున్న బ్రిటన్
న్యూఢిల్లీ: భారత్‌లోని వెనుకబడిన రాష్ట్రాలలో విద్య, వైద్యం లాంటి మౌలిక వసతుల అభివృద్ధి కోసం బ్రిటన్ దీర్ఘకాలంగా కేటాయిస్తున్న నిధులను జనవరి 1 నుంచి నిలిపివేయనుంది. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను మాత్రం పూర్తిచేయనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. మిగిలిపోయిన నిధులను సాంకేతిక సహాయంలో భాగంగా అందించనున్నట్లు తెలిపింది. 2013-15 మధ్య కాలంలో ఒడిషా, బిహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం బ్రిటన్ నుంచి సుమారు రూ. 850 కోట్ల ఆర్థిక సహాయాన్ని భారత్ పొందింది. గతంలో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలకు భారత్ కేటాయిస్తున్న నిధుల్లో బ్రిటన్ అందించే సహాయం వాటా చాలా తక్కువని, ఆ నిధులు లేకపోయినా భారత్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలదని వ్యాఖ్యానించారు. అప్పట్లో ప్రణబ్ వ్యాఖ్యలపై బ్రిటన్‌లో పెద్ద దుమారమే రేగింది. బ్రిటన్ భారత్‌కు అందిస్తున్న స్వల్పసాయం పట్ల ఆ దేశ పార్లమెంట్లో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్ కు అందిస్తున్న సహాయాన్ని 2016 జనవరి 1 నుంచి నిలిపివేయడానికి బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాలకు గాను ఐదు అంశాలలో సహకారానికి బ్రిటన్‌తో భారత్ ఒప్పందం కుదుర్చకుంది. ఇందులో వ్యవసాయ రంగంలో సాంకేతిక సహకారంతో పాటు పట్టణ మౌలిక వసతులు, శక్తి వనరుల పెంపు తదితర అంశాలు ఉన్నాయి.