
జీఎం కార్ల ధరలు పెంపు
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్(జీఎం) ఇండియా తాజాగా వాహన ధరలను రూ.51,000 వరకు పెంచింది. బడ్జెట్‌లో లగ్జరీ ట్యాక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సు వడ్డింపే ధరల పెంపునకు కారణమని కంపెనీ తెలిపింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు రూ.3,500-రూ.51,000 శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. ధరల పెంపు తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది.