luxury tax
-
ఇక లగ్జరీలన్నీ మరింత ప్రియం
రూ. 10 లక్షల కన్నా ఖరీదైన కారు కొనాలనుకుంటున్నారా..? అయితే మీరు కారు ధర కంటే ఒక శాతం అదనపు మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. 2016-17 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై లగ్జరీ పన్నును జూన్ 1నుంచి విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టాక్స్ పన్నును అమలుచేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ అదనపు పన్నును కారు అమ్మకం దారుడు వసూలు చేయాల్సి ఉంటుంది. ఎక్స్ షోరూం ధరలను బట్టి ఈ పన్ను విధిస్తామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. అదేవిధంగా లగ్జరీ పన్నుతో పాటు కృషి కల్యాణ్ సెస్ పేరిట సర్వీసు పన్నులపై అదనంగా 0.50 శాతాన్ని అదనపు పన్నును వసూలు చేయనున్నారు. దీంతో ఇకనుంచి బయట రెస్టారెంట్లలో భోజనం చేయడం, ట్రావెలింగ్, ఇన్సూరెన్స్ , ప్రాపర్టీ కొనుగోలుకు ఫోన్లు చేయడం వంటివి ప్రియం కానున్నాయి. కృషి కల్యాణ్ సెస్ పేరిట 0.50 సర్వీసు పన్నును పెంచడంతో ఇప్పడివరకూ ఉన్న సర్వీసు టాక్స్ రేటు 14.5 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. గతేడాదే ఈ సర్వీసు టాక్స్ లను ఆర్థికమంత్రి పెంచారు. 12.36 గా సర్వీసు పన్నులను 14 శాతానికి చేశారు. స్వచ్ఛ్ భారత్ పేరిట మరోమారు 0.50 శాతం పెంచారు. ఈ ఏడాది కృషి కల్యాణ్ పేరిట మరో 0.50 శాతం అదనంగా సెస్ విధించనున్నట్టు అరుణ్ జైట్లీ బడ్జెట్ లో తెలిపారు. -
జీఎం కార్ల ధరలు పెంపు
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్(జీఎం) ఇండియా తాజాగా వాహన ధరలను రూ.51,000 వరకు పెంచింది. బడ్జెట్లో లగ్జరీ ట్యాక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు వడ్డింపే ధరల పెంపునకు కారణమని కంపెనీ తెలిపింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు రూ.3,500-రూ.51,000 శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. ధరల పెంపు తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. -
కర్నాటకలో పెళ్లాడితే అంతే సంగతులు...
ఆకాశమంత పందిరి, భూదేవంత పీట....వేసి ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? మీరు కర్నాటకలో ఉంటే అదేం కుదరదు. ఎందుకంటే అన్నీ కుదిరితే కర్నాటక ప్రభుత్వం పెళ్లి ఆర్భాటంపై పన్ను వేసేయబోతోంది. పెళ్లి ఖర్చు 5 లక్షలకు మించినా, 1000 మంది కన్నా ఎక్కువ మంది అతిథులు హాజరైనా అంతే సంగతులు. మీరు లగ్జరీ పన్ను కట్టాల్సిందే. కాబట్టి మా మాట విని సింపుల్ గా కానిచ్చేయడమే మంచిది. కర్నాటక న్యాయవ్యవహారాల శాఖ మంత్రి టీబీ జయచంద్ర ఈ విషయాన్ని చెప్పారు. ఇటీవల ఆయనకు ఒక పెళ్లి కార్డు వచ్చింది. దాని ఖరీదు ఏడువేల రూపాయలు. అది చూసే సరికి మంత్రిగారు ఖంగుతిని, పన్ను వేసేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు పెళ్లిపై పన్నులే కాదు, పన్నులు ఎంత వేయాలో నిర్ణయించే, పనిని సరిగ్గా చేయించే పెళ్లి టాక్సు అధికారులను కూడా నియమించబోతున్నారు. ఇలా సేకరించిన పన్ను మొత్తంతో పేదల ఇళ్లలో పెళ్లిళ్లకు 25000 చొప్పున ప్రభుత్వం ఇస్తుందట. అయితే ప్లేటు భోజనానికే 250 రూపాయలు ఖర్చయ్యే ఈ రోజుల్లో 500 మంది మంది వచ్చినా 1.25 లక్షల రూపాయలు కావాలి. కనీసం అమ్మాయికి ఓ నాలుగు తులాల బంగారం పెట్టాలంటే లక్ష రూపాయలు ఖర్చవుతుంది. అమ్మాయి తరఫు, అబ్బాయి తరఫు ఖర్చు మొత్తం కలిపి 5 లక్షలు ఉండాలా లేక ఒకొక్కరి ఖర్చూ అయిదువేలు మించకూడదా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. అయితే కర్నాటక మంత్రి మాత్రం కేరళలో ఇప్పటికే ఇలాంటి పన్ను వసూలవుతోందని దబాయించారు. ఈ పెళ్లి పన్ను కూడా ఎన్నికల వ్యయ పరిమితిలా కాగితాలకే పరిమితమౌతుందా అన్నదే అసలు ప్రశ్న!