ప్రపంచదేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ దెబ్బకు కేసులు గణనీయంగా పెరగడంతో ఆయా దేశాలు లాక్ డౌన్‌ను విధించే ఆలోచనలో ఉన్నాయి. కాగా ఒమిక్రాన్ ప్రభావం దిగ్గజ టెక్ కంపెనీలపై కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గూగుల్, ఫేస్‌బుక్, ఇంటెల్ బాటలోనే..!
2022 జనవరి అమెరికా లాస్‌వెగాస్‌లో జరిగే టెక్ కాన్ఫరెన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, ఫేస్‌బుక్, ఇంటెల్ ఇప్పటికే పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. వారి బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా పయనిస్తోంది. సీఈఎస్-2022 షోలో పాల్గొనట్లేదని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా తాత్కలికంగా టెక్ కాన్ఫరెన్స్‌ను వాయిదా వేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. లాస్ వెగాస్‌లో జనవరి 5,6,7,8 తేదీల్లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జరగనుంది.
40కు పైగా కంపెనీలు
లెనొవొ, టీ-మొబైల్స్, ఏటీ అండ్ టీ, మెటా, ట్విటర్, అమెజాన్, టిక్‌టాక్, పింట్‌రెస్ట్, ఆల్ఫాబెట్‌కు చెందిన వేమో వంటి 40కి పైగా బడా టెక్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ సదస్సుకు హాజరు కావాల్సి ఉండగా....వీరు కూడా సీఈఎస్-2022 షోలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ షోలో సుమారు 2200 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు పాల్గొనున్నాయి.
అంతర్జాతీయ సదస్సులు వాయిదా..!
అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇప్పటికే తెలిపింది.కాగా మరోవైపు ఒమిక్రాన్ అలజడితో జెనీవాలో జరగాల్సిన డబ్య్లూటీవో మినిస్టీరియల్ (ఎంసీ12) కూడా వాయిదా పడింది.
చదవండి: చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్ మస్క్..!
Comments
Please login to add a commentAdd a comment