అమెరికన్ వాహన తయారీ 'జనరల్ మోటార్స్' కంపెనీ 4,49,000 కంటే ఎక్కువ పికప్ ట్రక్కులు, ఎస్యూవీలకు రీకాల్ ప్రకటించింది. ఈ విషయాన్ని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
కంపెనీ రీకాల్ ప్రకటించిన వాహనాల జాబితాలో.. 2023-2024 కాడిలాక్ ఎస్కలేడ్, ఎస్కలేడ్ ESVలు, 2023 చేవ్రొలెట్ సిల్వరాడో 1500, 2023-2024 చేవ్రొలెట్ టాహో, సబర్బన్ సిఐ 1500, 2023 జీఎంసి సియెర్రా 1500, 2023-24 జీఎంసి యుకాన్ ఎక్స్ఎల్ మోడల్స్ ఉన్నాయి.
రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. ఎలక్ట్రానిక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్ బ్రేక్ ఫ్లూయిడ్ కోల్పోయినప్పుడు వార్ణింగ్ ప్రదర్శించడంలో లోపం అని తెలుస్తోంది. ఇది బ్రేకింగ్ పనితీరును తగ్గిస్తుంది, దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ రీకాల్ ప్రకటించింది.
కంపెనీ వాహనాలను వినియోగిస్తున్న కస్టమర్లకు అక్టోబర్ 28న మెయిల్ ద్వారా సమాచారం అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ సమస్యను కంపెనీ ఉచితంగా పరిష్కరిస్తుంది. దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment