చెన్నై: జనరల్ మోటార్స్ కంపెనీ కార్ల ధరలను రూ.49,000 వరకూ తగ్గించింది. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో పలు కంపెనీలు వాహనాల ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా జనరల్ మోటార్స్ కూడా ధరలను తగ్గించింది. తాము విక్రయిస్తున్న ఆన్ని రకాల వాహనాలపై ధర లను రూ.12,000 నుంచి రూ.49,000 రేంజ్‌లో తగ్గిస్తున్నామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్-ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ గురువారం చెప్పారు. సుంకం తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు అందిస్తామన్నారు. షెవర్లే బీట్‌లో కొత్త వెర్షన్‌ను ఆయన ఇక్కడ ఆవిష్కరించారు. ఈ కొత్త వెర్షన్ ధరలు రూ.3.98-రూ.6.21 లక్షల (ఎక్స్ షోరూమ్, చెన్నై)రేంజ్‌లో ఉన్నాయి. ఈ కంపెనీ స్పార్క్, సెయిల్, సెడాన్ సెయిల్ యూ-వీఏ, ప్రీమియం సెడాన్ క్రూజ్, మల్టీ యుటిలిటీ వెహికల్స్-తవేరా, ఎంజాయ్, ఎస్‌యూవీ క్యాప్టివాలను విక్రయిస్తోంది.
జీఎం కార్ల ధరలూ తగ్గాయ్
Published Fri, Feb 21 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM
Advertisement