cars prices
-
జనవరి నుంచి కార్ల ధరలు మోతే!
సాక్షి, ముంబై: వాహన ధరల మోతకు మరో కంపెనీ సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వివిధ మోడళ్లపై రూ.28 వేల వరకు ధరల్ని పెంచుతున్నట్లు శుక్రవారం రెనో కంపెనీ ప్రకటించింది. ఫలితంగా కంపెనీ తయారీ చేసే క్విడ్, డస్టర్, ట్రిబర్ మోడళ్ల ధరలు పెరగనున్నాయి. స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్, ఇతర ఖర్చుల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరగడంతో మోడళ్ల ధరలను పెంచాల్సివచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (యూట్యూబ్ వీడియోలు తెగ చూస్తున్నారు) హీరో మోటో కూడా... ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ జనవరి నుంచి ధరలను పెంచనుంది. వాహన మోడళ్లను బట్టి రూ.1,500 వరకు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇన్పుట్ వ్యయం పెరగడం వల్లే ధరల పెంపునకు ప్రధాన కారణమని పేర్కొంది. స్టీల్, అల్యూమీనియం, ప్లాస్టిక్ వంటి అన్ని వస్తువుల వ్యయం క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. ముడిసరుకు, కమోడిటీ ధరలు, ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో ఇప్పటికే మారుతీ, ఫోర్డ్, మహీంద్రా కంపెనీలు జవవరి 1 నుంచి తమ వాహనాలపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జీఎం కార్ల ధరలూ తగ్గాయ్
చెన్నై: జనరల్ మోటార్స్ కంపెనీ కార్ల ధరలను రూ.49,000 వరకూ తగ్గించింది. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో పలు కంపెనీలు వాహనాల ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా జనరల్ మోటార్స్ కూడా ధరలను తగ్గించింది. తాము విక్రయిస్తున్న ఆన్ని రకాల వాహనాలపై ధర లను రూ.12,000 నుంచి రూ.49,000 రేంజ్లో తగ్గిస్తున్నామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్-ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ గురువారం చెప్పారు. సుంకం తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు అందిస్తామన్నారు. షెవర్లే బీట్లో కొత్త వెర్షన్ను ఆయన ఇక్కడ ఆవిష్కరించారు. ఈ కొత్త వెర్షన్ ధరలు రూ.3.98-రూ.6.21 లక్షల (ఎక్స్ షోరూమ్, చెన్నై)రేంజ్లో ఉన్నాయి. ఈ కంపెనీ స్పార్క్, సెయిల్, సెడాన్ సెయిల్ యూ-వీఏ, ప్రీమియం సెడాన్ క్రూజ్, మల్టీ యుటిలిటీ వెహికల్స్-తవేరా, ఎంజాయ్, ఎస్యూవీ క్యాప్టివాలను విక్రయిస్తోంది. -
జీఎం కార్ల ధరలు పెరుగుతాయ్
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ ఇండియా కంపెనీ కూడా కార్ల ధరలను పెంచుతోంది. అన్ని మోడళ్ల కార్లధరలను వచ్చే నెల నుంచి రూ. 10,000 వరకూ పెంచుతున్నామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ శుక్రవారం చెప్పారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు పాక్షికంగానైనా తట్టుకోవడానికి ధరలను పెంచుతున్నామని వివరించారు. ఈ కంపెనీ రూ.3.33 లక్షల నుంచి రూ. 25.71 లక్షల రేంజ్లో వివిధ రకాల కార్లను విక్రయిస్తోంది. రూపాయి పతనం, ద్రవ్యోల్బణం పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం ఇత్యాది కారణాల వల్ల పలు వాహన కంపెనీలు ధరలను వచ్చే నెల నుంచి పెంచుతున్నాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలతో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల కంపెనీలు కూడా ధరలను పెంచుతున్నాయి.