జీఎం కార్ల ధరలు పెరుగుతాయ్
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ ఇండియా కంపెనీ కూడా కార్ల ధరలను పెంచుతోంది. అన్ని మోడళ్ల కార్లధరలను వచ్చే నెల నుంచి రూ. 10,000 వరకూ పెంచుతున్నామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ శుక్రవారం చెప్పారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు పాక్షికంగానైనా తట్టుకోవడానికి ధరలను పెంచుతున్నామని వివరించారు. ఈ కంపెనీ రూ.3.33 లక్షల నుంచి రూ. 25.71 లక్షల రేంజ్‌లో వివిధ రకాల కార్లను విక్రయిస్తోంది. రూపాయి పతనం, ద్రవ్యోల్బణం పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం ఇత్యాది కారణాల వల్ల పలు వాహన కంపెనీలు ధరలను వచ్చే నెల నుంచి పెంచుతున్నాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలతో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల కంపెనీలు కూడా ధరలను పెంచుతున్నాయి.