మళ్లీ నంబర్-1 టయోటానే! | Toyota tops global car sales in 2013, goes for milestone 2014 with 10 mln sales | Sakshi
Sakshi News home page

మళ్లీ నంబర్-1 టయోటానే!

Published Fri, Jan 24 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

Toyota tops global car sales in 2013, goes for milestone 2014 with 10 mln sales

 టోక్యో: ప్రపంచ అగ్రశ్రేణి వాహన కంపెనీగా టయోటా అవతరించింది. గతేడాది 99.8 లక్షల వాహనాలను విక్రయించినట్లు గురువారం కంపెనీ ప్రకటించింది. కంపెనీ చరిత్రలో ఇవే అత్యధిక వార్షిక విక్రయాలని తెలియజేసింది. జనరల్ మోటార్స్ (97.1 లక్షల వాహన విక్రయాలు), ఫోక్స్‌వ్యాగన్‌లను (95 లక్షలు) మించి ఎక్కువ వాహనాలను అమ్మామని తెలిపింది. జపాన్ కరెన్సీ యెన్ బలహీనపడడం, అమెరికా, చైనా అమ్మకాలు పుంజుకోవడం తదితర కారణాల వల్ల తాము ఈ ఘనత సాధించామని పేర్కొంది. అత్యధిక వాహనాలు విక్రయించిన కంపెనీగా పదేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న అమెరికా కార్ల దిగ్గజం జనరల్ మోటార్స్‌ను తోసిరాజని 2008లో టయోటా ఆ స్థానంలోకి దూసుకువచ్చింది.
 
 జపాన్‌లో సునామీ కారణంగా మూడేళ్ల తర్వాత ఆ స్థానాన్ని కోల్పోయింది. 2012లో మళ్లీ మొదటి స్థానంలోకి వచ్చింది. కాగా కోటి వాహనాలు విక్రయించిన తొలి కంపెనీగా ఈ ఏడాది నిలుస్తామని టయోటా ధీమా వ్యక్తం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement