![జీఎం నుంచి ‘కాప్టివా’ కొత్త వెర్షన్](/styles/webp/s3/article_images/2017/09/2/51426538421_625x300.jpg.webp?itok=WBvdAs4n)
జీఎం నుంచి ‘కాప్టివా’ కొత్త వెర్షన్
ధర రూ. 27.36 లక్షలు
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ (జీఎం) తన ‘కాప్టివా’ మోడల్‌లోనే మరో వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 27.36 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ). తమ కంపెనీ మార్కెట్ వృద్ధి కోసమే ఈ కొత్త వెర్షన్‌ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నామని జీఎం మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ అరవింద్ సక్సేనా అన్నారు. ఈ అప్‌డేటెడ్ మోడల్ మాన్యువల్, ఆటోమెటిక్ అనే రెండు వెర్షన్లలో లభించనున్నాయి.