
వాషింగ్టన్/పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ మహోజ్వల ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో చూసి ప్రపంచవ్యాప్తంగా భక్తులు పులకించిపోయారు. ఆస్ట్రేలియా నుంచి అమెరికా దాకా సంబరాలు జరుపుకున్నారు. న్యూయార్క్‌లో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద భారీ తెరలపై వందలాది భారతీయ అమెరికన్లు వేడుకను వీక్షించారు. సంప్రదాయ వస్త్రధారణలో భజనలు, కీర్తనలు చేశారు.
పాకిస్తానీ ముస్లింలు సైతం..
అమెరికాలో వర్జీనియా రాష్ట్రం ఫెయిర్‌ఫాక్స్ కౌంటీలోని శ్రీవెంకటేశ్వర లోటస్ టెంపుల్ వద్ద సిక్కులు, ముస్లింలు, పాకిస్తానీ అమెరికన్లు, క్రైస్తవులు సైతం వేడుకల్లో పాలుపంచుకున్నారు. అమెరికా స్టాక్ ఎక్సే్చంజ్ ‘నాస్‌డాక్’ స్క్రీన్ మీదా కోదండరాముని చిత్రాన్ని ప్రదర్శించారు. లాస్‌ఏంజిలెస్‌లో 1,000 మందికిపైగా 250 కార్ల ర్యాలీ చేపట్టారు. పారిస్‌లో ఈఫిల్ టవర్ వద్ద భారతీయులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ట్రినిడాడ్, టొబాగో, మారిషస్, ఫిజీ, స్పెయిన్ తదితర దేశాల్లో సంబరాలు జరిగాయి. మెక్సికోలో తొలి రామాలయాన్ని అయోధ్య ప్రాణప్రతిష్ట ముహూర్తంలోనే ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment