![Adivi Sesh Major Trends At Top 10 On Netflix Across 14 Countries - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/16/major.jpg.webp?itok=n8RyU8Gw)
Major Trends At Top 10 On Netflix Across 14 Countries: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అడివి శేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా సత్తా చాటుతోంది. అడవి శేష్ నటన, యాక్షన్ సీక్వెన్స్, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వివిధ దేశాల్లోని ప్రజలను ఆకట్టుకుంటోంది.
'మేజర్' చిత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 14 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు, హిందీ భాషలతోపాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉండగా.. బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, మలేషియా, ఒమన్, మాల్దీవులు, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ, ఖతార్, సింగపూర్ సహా 14 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్స్ టాప్-10లో నిలిచింది. ఇండియా, మారిషస్, నైజీరియాలో టాప్-1లో ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ విషయంపై హీరో అడవి శేష్ సంతోషం వ్యక్తం చేశాడు. 'నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమాపై ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. నిజంగా మేము గర్వపడే సందర్భమిది. ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే' అని తెలిపాడు.
India's hero is being celebrated worldwide 💥💥#MajorTheFilm is trending in Top 10 films on @NetflixIndia across 14 countries ❤️🔥❤️🔥@AdiviSesh #SobhitaDhulipala @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @sonypicsindia pic.twitter.com/sKv0jQ3IGr
— Major (@MajorTheFilm) July 14, 2022
Comments
Please login to add a commentAdd a comment