సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రజనీకాంత్ దర్బార్ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దర్బార్ కలెక్షన్ల సునామీతో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరి మరో రికార్డు సొంతం చేసుకుంది. విడులైన పదకొండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దర్బార్ రూ. 200 కోట్లు రాబట్టిందని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ వెల్లడించారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టిన రజనీకాంత్ ఐదో సినిమా ‘దర్బార్’ కావడం విశేషం. గతంలో రాజనీకాంత్ నటించిన ఎంతిరాన్, కబాలి, రోబో 2.ఓ, పేటా చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల కలెక్షన్లను సాధించాయి. కాగా ఈ భారీ కలెక్షన్లలో అధికభాగం తమిళనాడు నుంచి సుమారు రూ. 80 కోట్లు వచ్చాయని త్రినాథ్ పేర్కొన్నారు. అదేవిధంగా ‘దర్బార్’ మూవీ కేరళలో రూ. 8 కోట్లు, కర్ణాటకలో రూ.19 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.
చదవండి: దర్బార్: ట్విటర్‌లో ఏమంటున్నారంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 20 కోట్లు, హిందిలో రూ.8 కోట్లు రాబట్టిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా విదేశాల్లో సుమారు రూ. 70 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. అభిమానులకు కావాల్సిన మాస్‌మసాలా అంశాలు, పోరాట సన్నివేశాలు రజనీని సూపర్‌స్టైలిష్‌గా చూపించిన ‘దర్బార్’ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ముంబై పోలీసు కమిషనర్ ఆదిత్య అరుణాచలంగా నటించిన రజనీకాంత్ నటన, స్టైల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుండటంతో ఈ సినిమా భారీగా వసూళ్లు సాధిస్తోంది.
చదవండి: దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర దారుణం
Comments
Please login to add a commentAdd a comment