న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడైనా హెల్త్ కవరేజీ పొందే ఫీచర్‌తో బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ‘గ్లోబల్ హెల్త్ కేర్’ పేరుతో ఒక పాలసీని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తీసుకున్న వారు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా తమ ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకుని, కవరేజీ పొందొచ్చు. భారత్‌లోనూ కవరేజీ ఉంటుంది. ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఎక్కడ ఉన్నా, వాటిని పొందే సదుపాయాన్ని కల్పించడమే ఈ ప్లాన్ ఉద్దేశ్యమని బజాజ్ అలియాంజ్ ప్రకటించింది. అలియాంజ్ పార్ట్‌నర్స్’ భాగస్వామ్యంతో బజాజ్ అలియాంజ్ ఈ పాలసీని తీసుకొచ్చింది.
రూ.37.50 లక్షల నుంచి కవరేజీ (బీమా/సమ్ అష్యూర్డ్) ప్రారంభమై, రూ.3.75 కోట్ల వరకు అందుబాటులో ఉంటుంది. ఇంపీరియల్ ప్లాన్, ఇంపీరియల్ ప్లస్ ప్లాన్ అనే రెండు రకాలుగా ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రకటించింది. హాస్పిటల్‌లో చేరి తీసుకునే చికిత్సలు, చేరే అవసరం లేకుండా తీసుకునే డే కేర్ ప్రొసీజర్స్, మానసిక అనారోగ్యం, పాలియేటివ్ కేర్, ఎయిర్ అంబులెన్స్, అవయవదాతకు అయ్యే ఖర్చులు, ఆధునిక చికిత్సలకు ఈ ప్లాన్‌లో కవరేజీ ఉంటుంది. ప్రీమియం రూ.39,432తో ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment