సాక్షి, హైదరాబాద్: విశ్వవ్యాప్తంగా అత్యధికులు జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. కులమతాలలు, ప్రాంతాలకు అతీతంగా దేశ విదేశాల్లో చాలా ఎక్కువమంది జరుపుకొనే పండుగ దీపావళి మాత్రమే. మనలోని చీకటిని తొలగించి మన అంతరంగాన్ని వెలుగులు నింపాలనే సందేశం. అజ్ఞాన తిమిరాన్ని తరిమికొట్టి కోట్లాదిమంది గుండెల్లో వేయి మతాబుల వెలుగులు చిందే ఈ దీపావళిని ఏయే దేశాల్లో ఎలా జరుపుకుంటారో ఒకసారి చూసి వద్దాం రండి. Have a Happy and safe Diwali!!
దీపావళి వేడుకలు భారతదేశంలోనే కాకుండా హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల జనాభా ఎక్కువగా ఉండే నేపాల్, భూటాన్, శ్రీలంక, మయాన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఫిజీ, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెన్యా, సురినామ్, గుయానా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, బ్రిటన్, కెనడా, అమెరికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో తదితర దేశాల్లోనూ ఘనంగా జరుగుతాయి. నేపాల్‌లో కూడా భారత్ మాదిరిగానే ఐదు రోజుల వేడుకలు జరుగుతాయి. విద్యుద్దీప కాంతులతో ఆయా దేశాల్లోని నగర వీధులు వెలిగిపోతాయి. సింగపూర్‌లోనూ దీపావళి పండుగ రోజు పబ్లిక్ హాలిడే కూడా.(Diwali 2021 Safety Tips: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!!)
ముఖ‍్యంగా సెంటోసా ఐల్యాండ్, క్లార్క్ క్వే, గార్డెన్స్ బై ది బే తదితర ప్రాంతాల్లో దీపావళి వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకుంటారు. మారిషస్‌లో కూడా భారతీయులు ఎక్కువే ఈ నేపథ్యంలో దీపావళి సందడి నెలకొంటుంది. పైగా సెలవు దినం కావడంతో దీపావళి వేడుకలను వీక్షించేందుకు బీచ్ ఒడ్డుకుని పర్వదినాన్ని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా కౌలాలంపూర్‌లో జరిగే దీపావళి వేడుకలు ప్రధాన ఆకర్షణ. అమెరికాలో భారతీయులు, ముఖ్యంగా తెలుగువాళ్లు దీపావళి కడు ముచ్చటగా నిర్వహించుకుంటారు. అమెరికాలోనూ దీపావళికి సెలవు ఇస్తారు. అక్కడి న్యూజెర్సీ, ఇల్లినాయిస్, టెక్సాస్, కాలిఫోర్నియాలలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటుతాయి. అలాగే ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు కన్నులపండువగా సాగుతాయి. ముఖ్యంగా మెల్‌బోర్న్‌లోని ఫెడరేషన్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలను చూసి తీరాల్సిందే.
చదవండి : Diwali 2021: పండుగ సంబరాలు, కథలు
ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో అందరూ నిబంధనలు పాటించాల్సిందే అని చాలా ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. దీంతోపాటు కాలుష్య రహితంగా ఈ పండుగను చేసుకోవాలని పిలుపునిచ్చాయి. నిర్దేశిత సమయంలో మాత్రమే దీపావళి టపాసులు పేల్చాలి. మరోవైపు భారీ శబ్దాలతో పిల్లలకు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా గ్రీన్ క్రాకర్లు, లేదా పర్యావరణ అనుకూల క్రాకర్స్ ద్వారా పండుగ నిర్వహించుకోవాలని పర్యావరణ వేత్తలు సూచనలు పాటిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment