Rolex: Suriya and Lokesh Kanagaraj likely to collaborate for role standalone movie - Sakshi
Sakshi News home page

Surya: ఆ చిత్రంపై క్లారిటీ ఇచ్చిన సూర్య.. ఫ్యాన్స్ ఖుషీ!

Published Sun, Aug 13 2023 9:20 PM | Last Updated on Mon, Aug 14 2023 9:16 PM

Actor Surya Clarity On Doing Movie Lokesh kanagaraj with Rolex Role - Sakshi

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. గతంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ చిత్రంలో కమల్ హాసన్ రోలెక్స్ పాత్రలో అభిమానులను మెప్పించిన సంగతి తెలిసిందే. లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన విక్రమ్‌లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న లుక్‌లో కమల్ హాసన్ కనిపించారు. డ్రగ్‌ మాఫియాను శాసించే రోలెక్స్‌ పాత్రలో సినిమా చూడాలని సూర్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఫ్యాన్స్‌ మీట్‌లో పాల్గొన్న సూర్య.. రాబోయే ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.   

(ఇది చదవండి : పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ యంగ్ హీరో.. పోస్ట్ వైరల్!)

సూర్య మాట్లాడుతూ..' ప్రస్తుతం నేను కంగువా సినిమాతో బిజీగా ఉన్నా. మేము అనుకున్న దానికంటే వందరెట్లు బాగా వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌లో కొత్త ప్రాజెక్ట్‌ స్టార్ట్ చేయబోతున్నా. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తా. దర్శకుడు వెట్రిమారన్‌ విడుదలై -2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత మా ఇద్దరి కాంబోలో వాడి వసల్‌ మొదలవుతుంది. ఇకపోతే లోకేశ్‌ కనగరాజ్‌ రోలెక్స్‌పై కథ చెప్పారు. అది చాలా  బాగా నచ్చింది. అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఆ తర్వాత  ఇరుంభుకై మాయావి చేస్తామని.' అన్నారు. ఈ వార్త విన్న సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మరోవైపు లోకేశ్‌ ప్రస్తుతం.. విజయ్‌తో లియో మూవీ చేస్తున్నారు.

కాగా.. సూర్య ప్రస్తుతం నటిస్తోన్న కంగువ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పది భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

(ఇది చదవండి : చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య, వీడియో కాల్‌ చేసి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement