యాక్టింగ్‌ దేవుడు | Robert De Niro throws a surprise birthday bash for Anupam Kher | Sakshi
Sakshi News home page

యాక్టింగ్‌ దేవుడు

Published Mon, Mar 12 2018 1:15 AM | Last Updated on Mon, Mar 12 2018 1:15 AM

Robert De Niro throws a surprise birthday bash for Anupam Kher - Sakshi

రాబర్ట్‌ డెనీరో, అనుపమ్‌ ఖేర్‌

రాబర్ట్‌ డెనీరోను యాక్టింగ్‌కు దేవుడిగా చెప్పుకుంటారు ఆయనను అభిమానించే వాళ్లు. ఐదు దశాబ్దాల కాలంలో లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకొని, తాను తప్ప ఇంకెవరూ చెయ్యలేరన్న పాత్రలు చేసి మెప్పించిన డెనీరోకు ఇండియాలోనూ ఫ్యాన్స్‌ తక్కువేమీ లేరు. ముఖ్యంగా ఇండియన్‌ సినిమా సెలెబ్రిటీలు తమకు బాగా ఇష్టమైన నటుల పేర్లు చెప్పమంటే వినిపించే పేర్లలో రాబర్ట్‌ డెనీరో పేరు ఎక్కువగా ఉంటుంది. ఇండియన్‌ సినిమాలో నటుడిగా తనకంటూ ఒక బ్రాండ్‌ సృష్టించుకున్న అనుపమ్‌ ఖేర్‌ కూడా డెనీరోకు వీరాభిమాని.

వీరిద్దరూ కలిసి గతంలో ‘సిల్వర్‌ లైనింగ్స్‌ ప్లేబుక్‌’ అనే హాలీవుడ్‌ సినిమాలో నటించారు. అప్పట్నుంచే ఇద్దరి మధ్యా మంచి ఫ్రెండ్‌షిప్‌ కూడా కుది రింది. తాజాగా అనుపమ్‌ ఖేర్‌ పుట్టినరోజు (మార్చి 7) సందర్భంగా డెనీరో తన భార్యతో కలిసి, అనుపమ్‌కు ఒక డిన్నర్‌ పార్టీ ఇచ్చాడు. హ్యాపీ బర్త్‌డే అంటూ డెనీరో పాట కూడా పాడాడు. ‘‘నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. నాకు యాక్టింగ్‌ దేవుడు ఇచ్చిన బర్త్‌డే పార్టీ గొప్ప సంతోషాన్నిచ్చింది.’’ అంటూ అనుపమ్‌ ఖేర్‌ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
∙రాబర్ట్‌ డెనీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement