వైరల్‌ : అర్జున్‌ డిన్నర్‌కు జాన్వీ, ఖుషీ! | Boney Kapoor Janhvi and Khushi have dinner with Arjun Kapoor | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 17 2018 7:06 PM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

Boney Kapoor Janhvi and Khushi have dinner with Arjun Kapoor - Sakshi

సాక్షి, ముంబై : దిగ్గజ నటి శ్రీదేవి అకాల మరణాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోవటానికి సినీ లోకం ప్రయత్నిస్తోంది. అయితే శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌లు మాత్రం ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి కష్ట సమయాన వీరికి తన అన్న అర్జున్‌ కపూర్‌, అక్క అన్షూలు బాసటగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్‌ తన చెల్లెళ్లను డిన్నర్‌కు ఆహ్వానించగా వారు తండ్రి బోనీ కపూర్‌తో కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం  ఈ డిన్నర్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

అర్జున్‌, అన్షూలు బోనీ కపూర్‌ మొదటి భార్య మోనా శౌర్య కపూర్‌ పిల్లలు. గతంలో జాన్వీ, ఖుషీలపై అర్జున్‌ కపూర్‌ అభిమానులు అసభ్యకర కామెంట్లు పెట్టగా అన్షూ తన చెల్లెళ్లను ఏమనవద్దని గట్టిగా వార్నింగ్‌ కూడా ఇచ్చింది. శ్రీదేవి బతికున్నంత కాలం ఆమె కుటుంబానికి దూరంగా ఉన్న అర్జున్‌, అన్షూలు ఇప్పుడిప్పుడే తండ్రి బోనీతోపాటు జాన్వీ, ఖుషీలకు దగ్గర అవుతున్నారు.





No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement