
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలు. ఈ సినిమాలో హిందీ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే తాజాగా ఓ రూమర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రాజమౌళి మరో క్రేజీ మల్టీ స్టారర్‌కు రంగం చుట్టారట. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తారని టాక్.
దీనిపై అధికారిక సమాచారం లేకున్నా, వీరి ముగ్గురి పేర్లూ వినగానే, ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మాతగా ఓ చిత్రాన్ని రాజమౌళి అంగీకరించిన సంగతి తెలిసిందే. రాజమౌళి తరువాతి సినిమా ఇదేనని, ఇదే చిత్రంలో ప్రభాస్ కూడా ఉంటారని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ కూడా నిర్మాతగా ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం జనవరి 8, 2021 విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment