టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనగానే టక్కున చెప్పే పేరు ఎస్‌ఎస్ రాజమౌళి. తెలుగు చలనచిత్ర స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయనే. స్టూడెంట్ నం.1 నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు టాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించారు. అలా భారత సినీ పరిశ్రమలో డైరెక్టర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి. ఇటీవల ఆయన రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల రివార్డులతో పాటు రికార్డులను సొంతం చేసుకుంటుంది.
చదవండి: అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటిస్తా: రణ్‌బీర్ కపూర్
ఇప్పటికే ఆస్కార్ బరిలో నిలిచిన ఈ మూవీ రీసెంట్‌గా గోల్డెన్ గ్లోబ్స్- 2023 అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ నాన్ ఇంగ్లీష్ చిత్రం, ఉత్తమ పాటల కేటగిరీలో నామినేట్ అవ్వడం విశేషం. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి గానూ డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్ కిరవాణిలు ఓ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకోగా, లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుకు రన్నర్‌గా నిలిచారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎమ్‌ఎమ్ కిరవాణి లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు. దీంతో వీరిద్దరికి సినీ సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి: పాన్ ఇండియా కల్చర్ ఇండస్ట్రీని నాశనం చేస్తోంది: స్టార్ డైరెక్టర్
అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వీరికి సోషల్ మీడియా వేధికగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు డార్లింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. ‘గ్రేటెస్ట్ రాజమౌళి గారు సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. బెస్ట్ డైరెక్టర్‌గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్‌తో పాటు లాస్ ఏంజెల్స్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ డెరెక్టర్ రన్నరప్ పురస్కారాలు అందుకున్నందుకు నా శుభాకాంక్షలు. అలాగే లాస్ ఏంజెల్స్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ గెల్చుకున్న కీరవాణి గారికి కంగ్రాట్స్’ అంటూ ప్రభాస్ పోస్ట్ చేశాడు. ఇక ప్రభాస్ పోస్ట్‌పై రాజమౌళి స్పందించారు. ‘‘థాంక్స్ డార్లింగ్. నేను ఇంత పేరు(ప్రపంచ స్థాయి గుర్తింపు) తెచ్చుకుంటానని నాకంటే ముందు నమ్మిన వ్యక్తి నువ్వే’’ అంటూ సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment