ఆ లఘు చిత్రం టైటిలే దీనికి పెట్టాను | It was a short film titles | Sakshi
Sakshi News home page

ఆ లఘు చిత్రం టైటిలే దీనికి పెట్టాను

Published Tue, Jul 29 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

ఆ లఘు చిత్రం టైటిలే దీనికి పెట్టాను

ఆ లఘు చిత్రం టైటిలే దీనికి పెట్టాను

‘‘లక్స్ సబ్బు వాణిజ్య ప్రకటనకి సహాయ దర్శకునిగా పనిచేసేవాణ్ణి. ఓ రోజు యాడ్ చేస్తున్న సమయంలో అందులోని ఓ సన్నివేశం నాకు నచ్చలేదు. అదే దర్శకుడికి చెప్పాను. ‘ఎలా తీస్తే బావుంటుందో నువ్వే చెప్పు’ అన్నారాయన. నాకు తెలిసింది చెప్పాను. అందరూ మెచ్చుకున్నారు.

ఎలాగైనా దర్శకుడు కావాలనే ఆకాంక్ష ఆ రోజే నాలో బలంగా మొదలైంది’’ అని యువ దర్శకుడు సుజిత్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘రన్ రాజా రన్’. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది.
 
ఈ సందర్భంగా సుజిత్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘ఇప్పటికి 40 లఘు చిత్రాలు తీశాను. వాటిలో ఓ దాని పేరు ‘రన్ రాజా రన్’. ఈ సినిమా కోసం కథ రాసుకున్నాక, అదే టైటిల్ సినిమాకు యాప్ట్ అనిపించింది. అందుకే ‘రన్ రాజా రన్’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘దర్శకునిగా నా తొలి సినిమా సంఘమిత్ర బ్యానర్‌లో మొదలైంది. అయితే, ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు. యు.వి. క్రియేషన్స్‌వారు కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారని తెలిసి వెళ్లాను. ఆఫీస్‌లో వాళ్లు అలాంటిదేం లేదని చెప్పారు.
 
అయినా పట్టు విడవకుండా ఎలాగోలా ప్రమోద్‌గారిని కలిసి ఈ కథ చెప్పాను. ఆయనకు ప్రథమార్ధం బాగా నచ్చింది. ద్వితీయార్ధంలో కొన్ని మార్పులు సూచించారు. ఆ చిన్న మార్పులతో ‘రన్ రాజా రన్’ మొదలైంది’’ అని తెలిపారు సుజిత్. నిజాలు మాట్లాడి ప్రేమలో అవరోధాలు ఎదుర్కొన్న కుర్రాడి కథ ఇదనీ,. తాను చెప్పే ఓ నిజం వల్ల క్రైమ్‌లో ఇరుక్కున్న హీరో... దాని నుంచి ఎలా బయటపడ్డాడనేది ఇందులో ఆసక్తికరమైన అంశమనీ, కథ, కథనం, సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయని ఆయన చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement