‘రన్ రాజా రన్’ విజయవంతం కావాలి | 'Raja Run Run' to succeed | Sakshi
Sakshi News home page

‘రన్ రాజా రన్’ విజయవంతం కావాలి

Published Thu, Jul 17 2014 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

‘రన్ రాజా రన్’ విజయవంతం కావాలి

‘రన్ రాజా రన్’ విజయవంతం కావాలి

  •  - సినీ హీరో శర్వానంద్
  •  తిరుమల : తాను నటించిన ‘రన్ రాజా రన్’ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించానని హీరో శర్వానంద్ తెలిపారు. బుధవారం ఉదయం సహస్ర కలశాభిషేకంలో ఆయన పాల్గొని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శర్వానంద్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. రన్ రాజా రన్ చిత్రం త్వరలోనే అభిమానుల ముందుకు రానుందన్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. ఆలయం వెలుపల శర్వానంద్‌ను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement