
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రామ్‌చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు అనే విషయంపై ఎప్పటికప్పుడు పలు వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని, అనిల్ రావిపూడితో సినిమా ఉండొచ్చని ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా ‘సాహో’ ఫేమ్ సుజీత్‌తో రామ్‌చరణ్ సినిమా చేసే అవకాçశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను యువీ క్రియేషన్ బ్యానర్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. యువీ క్రియేషన్స్ సంస్థ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీ అటు దర్శకుడు సుజీత్‌కి ఇటు రామ్‌చరణ్‌కి సన్ని హితులు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత చరణ్–సుజీత్ సినిమా ప్రారంభం అవుతుందట.
Comments
Please login to add a commentAdd a comment