కాంబినేషన్‌ రిపీట్‌? | Ram Charan and Vamshi Paidipally to team up again | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ రిపీట్‌?

Published Sun, Jul 12 2020 1:59 AM | Last Updated on Sun, Jul 12 2020 1:59 AM

Ram Charan and Vamshi Paidipally to team up again - Sakshi

వంశీ పైడిపల్లి, రామ్‌చరణ్

ఆరేళ్ల క్రితం వచ్చిన ‘ఎవడు’ (2014)తో హీరో రామ్‌చరణ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌ కుదిరింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుందనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్‌ తెరపైకి వచ్చింది. వంశీ పైడిపల్లి చెప్పిన ఓ కొత్త స్టోరీ లైన్‌ రామ్‌చరణ్‌కు నచ్చిందట. దీంతో ఫుల్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారట వంశీ. ఈ సంగతి ఇలా ఉంచితే... రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’లో నటిస్తున్నారు చరణ్‌. ఇందులో ఎన్టీఆర్‌ మరో హీరో. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement