RT4GM: Ravi Teja Set To Reunite With Gopichand Malineni Again For 4th Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

RT4GM: కాంబినేషన్ రిపీట్‌

Published Mon, Jul 10 2023 3:56 AM | Last Updated on Mon, Jul 10 2023 11:20 AM

Ravi Teja and Gopichand Malineni reunite again next movie - Sakshi

హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కొత్త సినిమా కోసం మరోసారి చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘డాన్ శీను’ (2010), ‘బలుపు’(2013), ‘క్రాక్‌’ (2021) చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబో నాలుగోసారి రిపీట్‌ అవుతున్నట్లు ఆదివారం ప్రకటించారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్  యర్నేని, వై.రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘వాస్తవ సంఘటనలతో గోపీచంద్‌ మలినేని ఓ కథను తయారు చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement