‘మనం’, ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ చిత్రాల్లో తనయుడు నాగచైతన్యతో కలిసి ఫుల్ లెంగ్త్ రోల్స్ చేశారు నాగార్జున. ఇప్పుడు తన మరో తనయుడు అఖిల్‌కు కూడా ఈ చాన్స్‌ను నాగార్జున కల్పించనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా వినిపిస్తోంది. నాగార్జున, అఖిల్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని, ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్నారని భోగట్టా. నాగార్జునకు ఇది వందో సినిమా అని, మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కలిసి చేసిన ‘బ్రో డాడీ’ చిత్రానికి రీమేక్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment