కమల్‌ విషయంలో ఫైనల్‌గా అదే నిజమైంది | Kamal Haasan confirms film with director H Vinoth next | Sakshi
Sakshi News home page

కమల్‌ విషయంలో ఫైనల్‌గా అదే నిజమైంది

Published Wed, Jul 5 2023 4:06 AM | Last Updated on Wed, Jul 5 2023 8:53 AM

Kamal Haasan confirms film with director H Vinoth next - Sakshi

జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు హీరో కమల్‌హాసన్‌. వరుసగా సినిమాలు సైన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌ 2’తో కమల్‌ బిజీగా ఉంటున్నారు. కాగా ‘నాయగన్‌’ (తెలుగులో ‘నాయకుడు’) తర్వాత మణిరత్నంతో మళ్లీ ఓ సినిమా చేయడానికి కమల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది కమల్‌హాసన్‌ కెరీర్‌లో 234వ సినిమాగా ప్రకటించారు.

దీంతో ఆయన 233వ సినిమా చర్చనీయాంశమైంది. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందనే టాక్‌ వినిపించింది. ఫైనల్‌గా అదే నిజమైంది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు హెచ్‌. వినోద్‌ కాంబినేషన్‌లో సినిమాను మంగళవారం ప్రకటించారు. ‘‘అండ్‌ ఇట్‌ బిగిన్స్‌. రైజ్‌ టు రూల్‌’ అంటూ ఈ సినిమాను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు కమల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement